Dalit Communities Anger On YS Jagan: జగన్‌పై దళిత సంఘాల ఆగ్రహం.. పర్యటన అడ్డుకుంటామంటూ..
ABN , Publish Date - Oct 09 , 2025 | 11:58 AM
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నర్సీపట్నం పర్యటనకు దళిత సంఘాల నుంచి నిరసన సెగ తగిలింది. డాక్టర్ సుధాకర్ కుటుంబానికి జగన్ క్షమాపణలు చెప్పాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి..
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నర్సీపట్నం పర్యటనకు దళిత సంఘాల నుంచి నిరసన సెగ తగిలింది. డాక్టర్ సుధాకర్ కుటుంబానికి జగన్ క్షమాపణలు చెప్పాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. క్షమాపణలు చెప్పకపోతే జగన్ పర్యటనను అడ్డుకుంటామని వారు హెచ్చరించారు. డాక్టర్ సుధాకర్ కు అవమానం జరిగిందంటూ నర్సీపట్నంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మాస్క్ ఇవ్వలేని వాళ్లు..మెడికల్ కాలేజీలపై మాట్లాడటమా అంటూ దళిత సంఘాల నేతలు జగన్ ను ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా మాజీ సీఎం జగన్ నర్సీపట్నం పర్యటనపై ఆసక్తి నెలకొంది.
ఇక జగన్ నర్సీపట్నం పర్యటన విషయానికి వస్తే... వైసీపీ ప్రభుత్వం నిర్మించిన నర్సీపట్నం మెడికల్ కాలేజీని ఆయన సందర్శించనున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరించేందుకు లేదా అమ్మేయడానికి ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జగన్ ఈ పర్యటన చేపట్టినట్లు వైసీపీ వర్గాలు తెలిపాయి.
జగన్ పర్యటనకు పోలీసులు కీలక ఆదేశాలు జారీ చేశారు. నర్సీపట్నం నియోజకవర్గంలో మాజీ సీఎం జగన్ పర్యటన సందర్భంగా పార్టీ కార్యకర్తలు ఎట్టి పరిస్థితుల్లోనూ జాతీయ, రాష్ట్ర హైవేలపై గుమిగూడి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించవద్దని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా కోరారు. ఇటీవల తమిళనాడులోని కరూర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనను దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. జగన్ పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసుల మార్గదర్శకాలను నిర్వాహకులు పాటించాలన్నారు. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుంటే నిర్వాహకులే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ప్రజలందరూ పోలీస్ శాఖ సూచనలు, మార్గదర్శకాలను కచ్చితంగా పాటించి, శాంతి భద్రతలను కాపాడటంలో భాగస్వాములు కావాలని ఎస్పీ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
మెడికల్ కాలేజీలపై వైసీపీకి హైకోర్ట్ షాక్..
వాగు ఉధృతి.. ప్రమాదకరంగా వాగు దాటుతున్న గిరిజనులు
Read Latest AP News And Telugu News