Share News

Pawan On Forest Conservation: అడవుల ఆక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు.. పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్

ABN , Publish Date - Oct 24 , 2025 | 09:11 PM

అటవీ శాఖ సిబ్బంది భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. అడవుల ఆక్రమణలకు పాల్పడిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించబోమని పవన్ కల్యాణ్ హెచ్చరించారు.

Pawan On Forest Conservation: అడవుల ఆక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు.. పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్
Pawan Kalyan On Forest Conservation

కృష్ణా, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): అటవీ శాఖ సిబ్బంది భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) వ్యాఖ్యానించారు. అడవుల ఆక్రమణలకు పాల్పడిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఇవాళ(శుక్రవారం) కృష్ణా జిల్లాలోని కొండపావులూరులోని జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ ఆవరణలో అటవీ శాఖ అధికారులకు రాష్ట్ర స్థాయి వర్క్‌షాపు నిర్వహించారు.


ఎకో టూరిజానికి ప్రోత్సాహం..

ఈ వర్క్‌షాపు‌కి ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరయ్యారు. గ్రేట్ గ్రీన్‌వాల్ ప్రచార పోస్టర్లు అధికారులతో కలిసి ఆవిష్కరించారు పవన్ కల్యాణ్. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడారు. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం విత్తనాలు చల్లించేందుకు ప్రణాళిక చేస్తున్నామని పేర్కొన్నారు. దేశ అవసరాలకు తగిన కలపని ఏపీ నుంచి అందిద్దామని సూచించారు. ఎకో టూరిజం ప్రోత్సాహంతో గిరిజన యువతకు ఉపాధి లభిస్తోందని చెప్పుకొచ్చారు. అటవీ శాఖను ఆదాయార్జన శాఖగా తయారు చేయాలని అధికారులకి దిశానిర్దేశం చేశారు. గ్రేట్ గ్రీన్ వాల్ ఏపీకి వరం కావాలని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.


ఆ ఘటనపై పవన్ కల్యాణ్ ప్రగాఢ సానుభూతి..

మరోవైపు.. తిరుపతి జిల్లా వేదాంతపురం వద్ద స్వర్ణముఖి నదిలో నలుగురు యువకులు గల్లంతయ్యారు. ఈ ఘటనపై పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ దుర్ఘటన తనకు తీవ్ర ఆవేదన కలిగించిందని తెలిపారు. నలుగురు యువకులు గల్లంతవగా, ఒకరి మృతదేహం లభ్యమైందని అధికారులు సమాచారం ఇచ్చారని చెప్పుకొచ్చారు. గల్లంతైన వారి జాడ కనిపెట్టేందుకు చేపట్టిన చర్యలని అధికారులు వివరించారని అన్నారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వర్షాలు కురుస్తున్న సమయమిదని... నదులు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తాయని... వాటిలో ఈతకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అధికారులు నీటి ప్రవాహాల దగ్గర హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి...

కర్నూలు జిల్లా బస్సు ప్రమాదం.. బైకర్ తల్లి చెప్పిన విషయాలివే..

బాలకృష్ణపై జగన్ వ్యాఖ్యలు సరికాదు.. మంత్రి పార్థసారథి ఫైర్

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 24 , 2025 | 09:20 PM