Share News

Governor Hari Babu: భారత్ సైనిక, సాంకేతిక రంగాల్లో దూసుకెళ్తుంది.. హరిబాబు కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Dec 21 , 2025 | 05:37 PM

పాకిస్థాన్‌లో ఉన్న త్రివిధ దళాలను శిబిరాలను ధ్వంసం చేశామని గవర్నర్ కంభంపాటి హరిబాబు తెలిపారు. భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన దేశంగా గుర్తింపు ఉందని వెల్లడించారు. మన దేశంలో రక్షణ పరికరాలను కూడా ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నామని వివరించారు.

Governor Hari Babu: భారత్ సైనిక, సాంకేతిక రంగాల్లో దూసుకెళ్తుంది..  హరిబాబు కీలక వ్యాఖ్యలు
Governor Hari Babu

ప్రకాశం, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ‌ స్థాయిలో భారతదేశానికి ఎంతో గౌరవం పెరిగిందని ఒడిస్సా రాష్ట్ర గవర్నర్ కంభంపాటి హరిబాబు (Odisha Governor Kambhampati Hari Babu) వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మన దేశాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు. ఆత్మ విశ్వాసంతో పని చేసే దేశంగా మనదేశం ముందుకు వెళ్తుందని చెప్పుకొచ్చారు. ఒంగోలులో ఏబీవీపీ రాష్ట్ర 44వ మహాసభలు జరుగుతున్నాయి. ఈ సభకు ఇవాళ(ఆదివారం) ముఖ్య అతిథిగా హాజరయ్యారు కంభంపాటి హరిబాబు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.


ఏబీవీపీ 44వ మహాసభలకు హాజరవ్వటం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఏబీవీపీలో మంచి సేవ కార్యక్రమాలు చేసిన వారికి అవార్డులు దక్కుతాయని వెల్లడించారు. విద్యార్థులు సేవా రంగంలో అధికంగా పాల్గొని సేవలు అందించాలని సూచించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏబీవీపీని విస్తరించడానికి చాలా కష్టపడి పని చేశామని వివరించారు. తాము అనేక ప్రాంతాలు పర్యటించామని.. విద్యార్థులతో చర్చించి సంభాషించామని తెలిపారు. విద్యార్థులకు ఉన్న సమస్యలతో పాటు హాస్టల్స్ ఉన్న సమస్యలు, స్కాలర్‌షిప్స్ సమస్యల‌ పరిష్కారానికి ఏబీవీపీ సహకరిస్తుందని పేర్కొన్నారు. విద్యార్థులు తమ సమస్యలతో పాటు దేశంలో ఉన్న సమస్యలను కూడా తెలుసుకోవాలని కోరారు గవర్నర్ కంభంపాటి హరిబాబు.


మన సైనికులు చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విజయవంతం అయిందని అన్నారు. పహల్గాం ఉగ్ర దాడులను తిప్పి కొట్టామని చెప్పుకొచ్చారు. పాకిస్థాన్‌లో ఉన్న త్రివిధ దళాలను శిబిరాలను ధ్వంసం చేశామని తెలిపారు. భారతదేశానికి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన దేశంగా గుర్తింపు ఉందని వెల్లడించారు. మన దేశంలో రక్షణ పరికరాలను కూడా ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నామని వివరించారు. దేశంలో విద్యుత్ వాడకం తగ్గి.. సౌరశక్తి ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసే విధంగా ప్రధాని మోదీ అందుబాటులోకి తీసుకువచ్చారని చెప్పుకొచ్చారు. ఎలక్ట్రికల్ కార్లు కూడా దేశంలో పెరుగుతున్నాయని గవర్నర్ కంభంపాటి హరిబాబు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జగన్ బర్త్‌డే వేడుక.. వైసీపీలో బయటపడ్డ కుమ్ములాటలు..!

అధికారంలోకి వస్తే అంతు చూస్తాం.. రెచ్చిపోయిన కాకాణి

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 21 , 2025 | 05:41 PM