Nara Lokesh: కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో లోకేష్ కీలక భేటీ.. చర్చించిన అంశాలివే
ABN , Publish Date - Dec 15 , 2025 | 03:36 PM
రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే నైపుణ్య గణనకు కేంద్ర సహాయం కావాలని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మంత్రి నారా లోకేష్ కోరారు. వివిధ ప్రాజెక్ట్‌లపైనా కేంద్రమంత్రితో లోకేష్ చర్చించారు.
న్యూఢిల్లీ, డిసెంబర్ 15: ఢిల్లీ పర్యటనలో మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) బిజీబిజీగా ఉన్నారు. పలువురు కేంద్రమంత్రులను కలుస్తూ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చిస్తున్నారు. అలాగే కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో మంత్రి లోకేష్ సమావేశమయ్యారు. వివిధ ప్రాజెక్టులపై చర్చించారు. ఏపీలో నైపుణ్య గణనకు సహకారం అందించాలని కేంద్రమంత్రిని కోరారు. రాష్ట్రంలో నైపుణ్య గణన కోసం అత్యాధునిక ఏఐ టెక్నాలజీతో రూపొందించిన నైపుణ్యం పోర్టల్ గురించి కేంద్రమంత్రికి వివరించారు. మంగళగిరిలో నిర్వహించిన పైలెట్ ప్రాజెక్ట్, అందులో ఎదుర్కొన్న సమస్యలు అధిగమించడానికి ఏఐ ఆధారిత ఇంటర్వ్యూ విధానం తీసుకొచ్చామని తెలిపారు.
త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే నైపుణ్య గణనకు కేంద్ర సహాయం కావాలని లోకేష్ కోరారు. దీనిపై కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ సానుకూలంగా స్పందించారు. అలాగే రాష్ట్రంలో యువ పారిశ్రామికవేత్తలు, ఔత్సాహిక వ్యవస్థాపకులకు అద్భుతమైన వేదికగా ఏర్పాటు చేసిన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌కు MeitY స్టార్టప్ హబ్ మద్దతుగా నిలవాలని కేంద్రమంత్రిని విజ్ఞప్తి చేశారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌లో AVGC-XR, WAVEX ఫ్రేమ్‌వర్క్ కింద InnoXR యానిమేషన్, AR/VR, Immersive Technologies కోసం సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ఏర్పాటుకు సహకారం అందించాలన్నారు.
ఇండియా ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్) మిషన్ కింద రాష్ట్రంలో ఏఐ విస్తృతి వేగవంతానికి మద్దతుగా నిలవాలని కేంద్రమంత్రిని మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. మంత్రి లోకేష్ వెంట కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని, ఎంపీలు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
మెడికల్ కాలేజీలపై మంత్రి డోలా కీలక వ్యాఖ్యలు
కల్తీ నెయ్యి కేసు.. వైవీ సుబ్బారెడ్డి పీఏకు హైకోర్టులో ఎదురుదెబ్బ
Read Latest AP News And Telugu News