CPI Leader Eshwarayya: సచివాలయ ఉద్యోగులపై పని భారం తగ్గించండి: సీఎంకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి లేఖ
ABN , Publish Date - Dec 15 , 2025 | 02:35 PM
సీఎం చంద్రబాబు నాయుడుకు సోమవారం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి. ఈశ్వర్యయ్య లేఖ రాశారు. సచివాలయ, వార్డు ఉద్యోగులపై పని భారం తగ్గించాలని సీఎంకు ఆయన సూచించారు.
అమరావతి, డిసెంబర్ 15: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఎన్నికల బూత్ స్థాయి అధికార (BLO) విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని సీఎం చంద్రబాబు నాయుడుకి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం సీఎం చంద్రబాబు నాయుడుకి ఆయన లేఖ రాశారు.16 రకాల సర్వేలతోపాటు ఎన్నికల విధుల పనిభారంతో సచివాలయ ఉద్యోగులు తీవ్ర అనారోగ్యం పాలవుతున్నారని ఈ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. పని ఒత్తిడితో 2 నెలల్లో నలుగురు సచివాలయ ఉద్యోగులు మరణించడం బాధాకరమని పేర్కొన్నారు. కర్నూలు జిల్లాలో 600 మందికిపైగా సచివాలయ ఉద్యోగులకు షోకాజు నోటీసులు జారీ చేయడం దుర్మార్గమన్నారు. సచివాలయ ఉద్యోగులపై పని భారం తగ్గించాలని సీఎం చంద్రబాబుకు ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య సూచించారు.
రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లోని సచివాలయం, వార్డులలో విధులు నిర్వహించే ఉద్యోగులు తీవ్ర పని ఒత్తిడికి గురవుతున్నారు. ఈ కారణంగా వారు తీవ్ర అనారోగ్యం బారిన పడుతున్నారు. దాంతో ఆకస్మిక గుండె పోటుతో వారు మరణిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబుకు సీపీఐ నేత ఈశ్వరయ్య లేఖ రాశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీలో రైతులకు గుడ్‌న్యూస్.. రూ.లక్ష వరకు రుణాలు
జాబ్ పోగొట్టుకున్న యువతి.. పనివేళల కంటే ముందే ఉద్యోగానికి వెళ్లి..
For More AP News And Telugu News