Share News

AP High Court: కల్తీ నెయ్యి కేసు.. వైవీ సుబ్బారెడ్డి పీఏకు హైకోర్టులో ఎదురుదెబ్బ

ABN , Publish Date - Dec 15 , 2025 | 03:15 PM

కల్తీ నెయ్యి కేసులో వైవీ సుబ్బారెడ్డి పీఏకు హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది.

AP High Court: కల్తీ నెయ్యి కేసు..  వైవీ సుబ్బారెడ్డి పీఏకు హైకోర్టులో ఎదురుదెబ్బ
AP High Court

అమరావతి, డిసెంబర్ 15: వైసీపీ రాజ్యసభ సభ్యుడు, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి (YV Subba Reddy) పర్సనల్ అసిస్టెంట్ చిన్న అపన్నకు ఏపీ హైకోర్టులో (AP High Court) ఎదురుదెబ్బ తగిలింది. శ్రీవారి లడ్డూ తయారీకి నకిలీ నెయ్యి సరఫరా కేసులో పీఏ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. శ్రీవారి ప్రసాదం లడ్డూ తయారీకి ఉపయోగించే కల్తీ నెయ్యి వ్యవహారంలో చిన్న అప్పన్న డెయిరీల నుంచి డబ్బులు తీసుకున్నాడని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై సీబీఐ ఆధ్వర్యంలో సిట్ విచారణ జరిపి చిన్న అప్పన్నను అరెస్ట్ చేసింది.


ఈ క్రమంలో తనకు బెయిల్ ఇవ్వాలంటూ ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వాద ప్రతివాదనలు పూర్తి అయిన తర్వాత ఈరోజు (సోమవారం) ధర్మాసనం తీర్పు ఇచ్చింది. చిన్న అప్పన్నకు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. టీటీడీ తరఫున, సీబీఐ తరఫున చేసిన వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. వారం క్రితం చిన్న అప్పన్న హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా.. ఆయన తరఫున సీనియర్ లాయర్లు వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం.. చిన్న అప్పన్న బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరిస్తూ తీర్పు వెలువరించింది.


ఇవి కూడా చదవండి..

పొట్టి శ్రీరాములు త్యాగ ఫలితమే ఆంధ్ర రాష్ట్రం: మంత్రి టీజీ భరత్

మెడికల్ కాలేజీలపై మంత్రి డోలా కీలక వ్యాఖ్యలు

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 15 , 2025 | 03:31 PM