Share News

Nara lokesh: ఉద్యోగాలే ఉద్యోగాలు.. యువతకు ఏపీ ప్రభుత్వం బంపర్ బొనాంజా

ABN , Publish Date - Jan 31 , 2025 | 04:46 PM

Nara lokesh: ఏపీలో యువతకు మంత్రి నారా లోకేష్ గుడ్‌న్యూస్ చెప్పారు. డీఎస్సీ నోటిఫికేషన్‌పై కీలక ప్రకటన చేశారు మంత్రి. మార్చిలో ప్రక్రియ ప్రారంభించి విద్యాసంవత్సరం ప్రారంభంలోనే టీచర్ల భర్తీ పూర్తి చేస్తామన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ, నవ్యాంధ్రలోనూ 80 శాతంపైగా టీచర్ల నియామకం చేసింది తెలుగుదేశం ప్రభుత్వమే అని చెప్పుకొచ్చారు.

Nara lokesh: ఉద్యోగాలే ఉద్యోగాలు.. యువతకు ఏపీ ప్రభుత్వం బంపర్ బొనాంజా
Minister Nara lokesh

అమరావతి, జనవరి 31: డీఎస్పీ నోటిఫికేషన్‌పై (DSC Notification) మంత్రి నారా లోకేష్ (Minister Nara lokesh) కీలక ప్రకటన చేశారు. శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో లోకేష్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. మార్చిలో ప్రక్రియ ప్రారంభించి విద్యాసంవత్సరం ప్రారంభంలోనే టీచర్ల భర్తీ పూర్తి చేస్తామన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ, నవ్యాంధ్రలోనూ 80 శాతంపైగా టీచర్ల నియామకం చేసింది తెలుగుదేశం ప్రభుత్వమే అని చెప్పుకొచ్చారు. ఉపాధ్యాయ సంఘాలతో నిత్యం సంప్రదింపులు జరుపుతూ ప్రజాస్వామ్య స్వేచ్ఛ కల్పిస్తున్నామన్నారు. ప్రభుత్వం తీసుకునే ప్రతీ నిర్ణయంలోనూ టీచర్ల అభిప్రాయ సేకరణ ఉంటోందన్నారు.


ప్రతీ శుక్రవారం కమిషనర్ ఉపాధ్యాయులకు వారి సమస్యలపై అందుబాటులో ఉంటున్నారని.. తాను కలుస్తున్నట్లు తెలిపారు. టీచర్ల బదిలీ పారదర్శకంగా ఉండేందుకు ట్రాన్స్ఫర్ యాక్ట్ తీసుకొస్తున్నామన్నారు. విద్యా వ్యవస్థ అంటే అనాలోచిత నిర్ణయాలు తీసుకునే వ్యవస్థ కాదని నిరూపిస్తున్నామని.. అందులో భాగస్వామ్యులైన వారందరితో చర్చించాకే నిర్ణయం తీసుకుంటూ ప్రజాస్వామ్య విలువలు చాటుతున్నామని మంత్రి వెల్లడించారు.

నామినేటెడ్ పోస్టుల జాతర ఎప్పుడంటే..


వైసీపీ ఆందోళనలు విడ్డూరం

జగన్ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు 3 వేలు కోట్లు పెట్టి దిగిపోయారని విమర్శించారు. ‘‘మేము మా విడతగా రూ.800 కోట్లు చెల్లింపులు చేశాం. జగన్ పెట్టిన జగన్ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై వైసీపీ నేతలు ఆందోళనలు చేయటం విడ్డూరంగా ఉంది’’ అని మండిపడ్డారు. జగన్ రైతులకు పెట్టిన ధాన్యం బకాయిలు, పెండింగ్ బిల్లులు, ఉద్యోగుల బకాయిలు అన్నీ తామే తీరుస్తున్నామన్నారు. అలాగే జగన్ పెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు తీర్చేది కూడా తామే అని స్పష్టం చేశారు. విద్యా వ్యవస్థలో విద్యార్థులు, ఉపాధ్యాయుల వివరాలను వైసీపీ ప్రభుత్వం గందరగోళం చేసిందని వ్యాఖ్యలు చేశారు. విద్యార్థుల సంఖ్య ఖచ్చితత్వాన్ని తెలుసుకునేందుకు ఆపార్ కార్డ్ విధానం తెస్తున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల డ్రాప్ ఔట్స్ నివారణకు ప్రత్యేక వ్యవస్థ తీసుకొస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.


నాయకల ఎదుగుదలకు కొత్త ప్రతిపాదన

నాయకులు, పార్టీ శ్రేణులు ఎదుగుదల కోసం ఒకే పదవిలో మూడు సార్లు కంటే ఎక్కువ ఉండకూడదనే ప్రతిపాదన తెచ్చానన్నారు. దీనిపై విస్తృత చర్చ తర్వాత పార్టీ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. గ్రామ స్థాయి నాయకుడు మండల స్థాయికి, మండలి స్థాయి వాళ్లు నియోజకవర్గ స్థాయికి, అక్కడి నుంచి జిల్లా స్థాయికి ఎదిగేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందన్నారు. తెలుగుదేశం సంస్థాగత నిర్మాణం ఎంతో గొప్పదని చెప్పుకొచ్చారు. అధినేత మినహా ఈ విధానం తనతో సహా అందరికీ వర్తింప చేస్తేనే కొత్తతరం రాజకీయాల్లోకి వస్తుందన్నారు. 40 ఏళ్లుగా పార్టీ పటిష్ఠంగా పనిచేస్తోందంటే అందుకు కారణం ఎన్టీఆర్ వేసిన బలమైన పునాదే అని అన్నారు.


లోకేష్ సీరియస్...

పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో పోలీసుల అత్యుత్సాహంపై నారా లోకేష్ అసహనం వ్యక్తం చేశారు. పార్టీ కార్యాలయంలో పోలీసులు ఎందుకు ఎక్కువ ఉన్నారంటూ మంత్రి సీరియస్ అయ్యారు. ఇంతమంది పోలీసులు ఎందుకు వచ్చారనే దానిపై అధికారులను ప్రశ్నించారు. పార్టీ కార్యాలయంలో జరిగే పోలిట్ బ్యూరో సమావేశానికి ఇంతమంది పోలీసులు అవసరమా అని అధికారులను అడిగారు. బందోబస్తు పేరుతో పార్టీ కార్యాలయానికి వచ్చే కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేయొద్దని స్పష్టం చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయానికి ప్రతిరోజు కార్యకర్తలు వస్తారు కాబట్టి, వారి వారి సమస్యలు చెప్పుకునేందుకు వచ్చే కార్యకర్తలను పోలీసులు ఇబ్బంది పెట్ట వద్దంటూ హితువు పలికారు. ‘‘మా పార్టీకి కార్యకర్తలే బలం... కార్యకర్తలు సమస్యలపై వచ్చినప్పుడు పోలీసులు హడావుడితో వారిని ఇబ్బంది పెట్టొద్దు’’ అని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి...

ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు...

TTD: టీటీడీ పాలకమండలి అత్యవసర సమావేశం.. నిర్ణయాలు ఇవే

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 31 , 2025 | 05:02 PM