Share News

Minister Lokesh: ఏయూ మాజీ వీసీ ప్రసాదరెడ్డి అక్రమాలపై విచారణ..

ABN , Publish Date - Mar 13 , 2025 | 11:50 AM

మాజీ సిఎం జగన్ విశాఖపట్నం వస్తే పిల్లలను రోడ్డుపైకి తెచ్చి స్వాగతం పలికించుకునేవారని, రూసా గ్రాంట్స్, ఇస్రో గ్రాంట్‌ను దుర్వినియోగం చేశారని మంత్రి లోకేష్ విమర్శించారు. మాజీ వీసీ ప్రసాదరెడ్డి రూలింగ్ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేశారని అన్నారు. దీనిపై ఇన్చార్జి వీసీ ఒక కమిటీని నియమించారని తెలిపారు.

Minister Lokesh: ఏయూ మాజీ వీసీ ప్రసాదరెడ్డి అక్రమాలపై విచారణ..
Minister Lokesh

అమరావతి: ఆంధ్రా యూనివర్సిటీ (Andhra University) అంటే అందరికీ ఒక సెంటిమెంటుతో కూడుకున్నదని, బ్యాంక్ ఆఫ్ అమెరికా ఛైర్మన్, జిఎమ్మార్ అధినేత ఏయూలో చదువుకుని వచ్చిన వారేనని, ఏయూ ప్రపంచంలోనే టాప్ 100లో ఉండాలని సిఎం చంద్రబాబు (CM Chandrababu) భావించారని విద్య,ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ (Miniser Nara Lokesh) అన్నారు. గురువారం అసెంబ్లీలో ప్రశ్నోత్తర సమయంలో ఆయన మాట్లాడుతూ.. ఏయూ టాప్‌లో ఉండాలనే ఉద్దేశంతో ఐఐటి కరఖ్ పూర్ ప్రోఫెసర్‌ రాజశేఖర్‌ను ఏయూ వీసీగా నియమించామన్నారు.

మాజీ సిఎం జగన్ విశాఖపట్నం వస్తే పిల్లలను రోడ్డుపైకి తెచ్చి స్వాగతం పలికించుకునేవారని, రూసా గ్రాంట్స్, ఇస్రో గ్రాంట్‌ను దుర్వినియోగం చేశారని మంత్రి లోకేష్ విమర్శించారు. మాజీ వీసీ ప్రసాదరెడ్డి రూలింగ్ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేశారని అన్నారు. దీనిపై ఇన్చార్జి వీసీ ఒక కమిటీని నియమించారని తెలిపారు. విజిలెన్స్ అకౌంట్ కూడా వేశామన్నారు. సభ డిమాండ్ మేరకు కమిటీ విచారణ జరిపి 60 రోజుల్లో రిపోర్టు ఇవ్వాలని మంత్రి లోకేష్ కమిటీని ఆదేశించారు. ఇంకోసారి పొరపాటు చేయాలంటే బయపడేటట్టు చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. ఆంధ్రా యూనివర్సిటీ ప్రమాణాలను పెంచి గతవైభవం తీసుకువస్తామని మంత్రి స్పష్టం చేశారు.

Also Read..:

బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీకి రెండోసారి నోటీసులు..


ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ..

ఏయూ మాజీ వీసీ ప్రసాద్ రెడ్డిపై ఉన్న ఆరోపణల విషయంలో ఇంత వరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. ఫండ్స్ డైవర్సన్, అక్రమ నియామకాలతో ఏయూను రాజకీయ కార్యాలయంగా ఎలా మార్చారో అందరికి తెలసునని అన్నారు. ఆంధ్ర యూనివర్సిటీ 1926లో స్ధాపించబడిందని, తాను కూడా యూనివర్సిటీ పూర్వవిద్యార్ధినని చెప్పారు. సెనేట్ హలులో రాజకీయ నాయకుల పుట్టిన రోజు పార్టీలు చేశారని, అడ్మినిస్ట్రేషన్ మ్యాన్యువల్లో ఉన్నట్లు ఆయన ఫాలో అవ్వలేదని, ఇష్టానుసారం అపాయింట్మెంట్ ఇచ్చారని శ్రీనివాసరావు అన్నారు. అతనిని ప్రైవేటు కాలేజీల నుండి తెచ్చి అసిస్టెంట్ ప్రోఫెసర్లుగా జగన్ నియమించారని, కొలిగ్స్ ఎవ్వరయినా లేట్‌గా వస్తే వారికి రూ. 25వేలు ఫైన్ వేసేవారని అన్నారు. గతంలో గ్రాడ్యూఏట్ ఎమ్మెల్సి ఎన్నికలు అవుతుంటే ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలతో దసపల్లా హోటల్‌లో మీటింగ్ పెట్టారని అన్నారు. దీనిపై కూడా విచారణ చేయాలన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చక కూడా ఇలాంటి క్రిమినల్స్ విషయంలో ఉదాసీనంగా ఉండడం తగదని అన్నారు.


ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు మాట్లాడుతూ.. ఎంతో చరిత్ర కలిగిన ఆంధ్రా యూనివర్సిటీని ప్రసాద్ రెడ్డి వైసీపీ కార్యాలయంగా మార్చాడని, గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు, మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో డబ్బు సంచులు మొదలుకోని అన్ని ఏయూలోనే జరిగాయన్నారు. యూజిసి రూసా నిధులు డిపిఆర్ ప్రకారం కాకుండా కోట్లది రూపాయయలు ఇష్టాను సారం నిధులు డైవర్ట్ చేశారని ఆరోపించారు. ఉద్యోగాల నుండి తొలగింపబడ్డ వ్యక్తిని బ్యూటిఫికేషన్ డీన్‌గా పెట్టి 80 లక్షల రూపాయలు దుర్వినియోగం చేశారని, యూనివర్సిటీలోని భారీ వృక్షాలను జగన్ హెలీప్యాడ్‌ల కోసం కొట్టేశారని వీటన్నింటిపై విచారణ జరపాలని ఆయన అన్నారు. ఆంధ్రా యూనివర్సిటీలో పరిశోధనలు చేస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసి విద్యార్ధులను ఇబ్బందులు పెట్టారని,పేద విద్యార్ధులకు యూనివర్సిటీని దూరం చేశారని, ఇంకా ప్రసాద్ రెడ్డి గురించి చెప్పాలంటే ఒక రోజు కూడా సరిపోదని.. ఆయనపై విచారణకు టైంబౌండ్ పెట్టి చర్యలు తీసుకోవాలి రామకృష్ణ బాబు డిమాండ్ చేశారు.


ఎమ్మెల్యే గణబాబు మాట్లాడుతూ..

ఆంధ్రాయూనివిర్సిటీ అనగానే సర్వేపల్లి రాధాకృష్ణన్, సివిరామన్, సరోజిని నాయుడు, నీలం సంజీవరెడ్డిలు గుర్తుకు వస్తారని ఎమ్మెల్యే గణబాబు అన్నారు. నియామకం జరిగాక స్వామి భక్తితో విగ్రహం పెట్టారని, కార్పోరేషన్ ఎన్నికల్లో అభ్యర్ధులకు బీఫాంలు ఏయూలో ఇచ్చారని, ఇలాంటివి మళ్లీ ఏ యూనివర్సిటీలో రాజకీయ కార్యకలాపాలు లేకుండా ఉండేలా కఠిన చర్యలు ఉండాలని అన్నారు. అన్ని ఆరోపణలపై విజిలెన్స్ విచారణ చేసి కాలపరిమితితో చర్యలు తీసుకోవాలన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

నంద్యాల జిల్లా, కంపమలలో భగ్గుమన్న పాత కక్షలు

చిన్న వివాదం.. యువకులు దాడి.. వృద్ధుడు మృతి..

సభలో పట్టాదారు పాసు పుస్తకం సవరణ బిల్లు..

For More AP News and Telugu News

Updated Date - Mar 13 , 2025 | 11:50 AM