PLR Projects SIT Raids: లిక్కర్ స్కాంలో సిట్ దూకుడు.. పీఎల్‌ఆర్ ప్రాజెక్ట్స్‌లో సోదాలు
ABN , Publish Date - Oct 14 , 2025 | 03:01 PM
పీఎల్‌ఆర్ ప్రాజెక్టులోకి రూ.15 కోట్లు, డికాట్ లాజిస్టిక్స్ నుంచి రూ. 25 కోట్లు మళ్లించినట్టు సిట్ గుర్తించింది. దీంతో నిధుల మళ్లింపుపై పీఎల్‌ఆర్ ప్రాజెక్ట్స్‌లో సిట్ బృందం ఆధారాలు సేకరిస్తోంది.
అమరావతి/హైదరాబాద్, అక్టోబర్ 14: మద్యం కుంభకోణం కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి (MP Mithun Reddy) చెందిన పీఎల్‌ఆర్ ప్రాజెక్ట్స్‌లో ఏపీ సిట్ అధికారులు సోదాలు నిర్వహించారు. పీఎల్‌ఆర్ ప్రాజెక్ట్స్‌లో నలుగురు సిట్ అధికారుల బృందం తనిఖీలు చేపట్టింది. ఏపీ లిక్కర్ స్కాం డబ్బులు పీఎల్‌ఆర్ ప్రాజెక్టులోకి మళ్లించినట్లు ఆధారాలు ఉన్న నేపథ్యంలో ఈ సోదాలు జరుగుతున్నాయి. పీఎల్‌ఆర్ ప్రాజెక్టులోకి రూ.15 కోట్లు, డికాట్ లాజిస్టిక్స్ నుంచి రూ. 25 కోట్లు మళ్లించినట్టు సిట్ గుర్తించింది. దీంతో నిధుల మళ్లింపుపై పీఎల్‌ఆర్ ప్రాజెక్ట్స్‌లో సిట్ బృందం ఆధారాలు సేకరిస్తోంది. అందుబాటులో ఉన్న సిబ్బంది నుంచి అధికారులు వివరాలను సేకరించే పనిలో ఉన్నారు.
మరోవైపు మిథున్ రెడ్డి నివాసంతో పాటు పలు చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్, బెంగళూరులోని నివాసాలు, కార్యాలయాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు సిట్ అధికారులు. హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్, ప్రశాసన్ నగర్, యూసుఫ్ గూడ గాయత్రీహిల్స్‌లోని మిథున్ నివాసాల్లో సిట్ బృందం సోదాలు చేస్తోంది. అలాగే కొండాపూర్‌లోని కార్యాలయంలోనూ సిట్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో కీలక పత్రాలను సీజ్ చేసినట్లు సమాచారం. కాగా.. మద్యం కుంభకోణంలో ఏ4గా ఉన్న ఎంపీ ఈ కేసులో అరెస్ట్ అయి ఇటీవలే బెయిల్‌పై విడుదలైన విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా.. ఈనెల 20న యూఎస్ వెళ్లాలంటూ ఎంపీ మిథున్ రెడ్డి ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై ఈరోజు (మంగళవారం) న్యాయస్థానం విచారించనుంది. 27న యూఎస్‌లో జరిగే భేటీలో పాల్గొనాల్సి ఉందని.. అక్కడకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును ఎంపీ మిథున్ రెడ్డి కోరారు.
ఇవి కూడా చదవండి..
గూగుల్‌తో ఏపీ ప్రభుత్వం చారిత్రక ఒప్పందం
ప్రధాని మద్దతుతోనే సాధ్యం.. గూగుల్‌తో ఒప్పందంపై సీఎం
Read Latest AP News And Telugu News