Google Data Center Visakha: రాష్ట్ర చరిత్రలో సువర్ణ అధ్యాయం: హోంమంత్రి అనిత
ABN , Publish Date - Oct 14 , 2025 | 02:10 PM
సాంకేతికతతో నూతన ఆవిష్కరణలు వస్తున్నాయని అనిత అన్నారు. ఉత్తరాంధ్ర వాసిగా ఎంతో సంతోష పడుతున్నానని అన్నారు మంత్రి. విశాఖను ఐటీ హబ్‌గా మార్చుతున్న సీఎం చంద్రబాబుకు, ఐటీ మంత్రి లోకేష్‌కు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు.
అమరావతి, అక్టోబర్ 14: గూగుల్ డేటా సెంటర్‌ను విశాఖలో ఏర్పాటు చేసేందుకు ఒప్పందం శుభ పరిణామమని హోం మంత్రి వంగలపూడి అనిత (Home Minister Vangalapudi Anitha) అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర చరిత్రలో ఇదొక సువర్ణ అధ్యాయంగా అభివర్ణించారు. గూగుల్ డేటా సెంటర్ రాకతో ఉత్తరాంధ్ర ప్రపంచ పటంలో నిలవనుందన్నారు. గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుతో 1.88 లక్షల మందికి ఉపాధి లభించనుందని తెలిపారు. గతంలో సీఎం చద్రబాబు హైదరాబాద్‍లో హైటెక్ సిటీ అభివృద్ధి చేశారని.. ప్రస్తుతం విశాఖను ఐటీ హబ్‍గా తీర్చిదిద్దబోతున్నారని అన్నారు. ఆనాడు హైదరాబాద్‍కు మైక్రోసాప్ట్ తీసుకొచ్చారని.. ప్రస్తుతం విశాఖకు గూగుల్‍ను తీసుకొస్తున్నారని పేర్కొన్నారు.
సాంకేతికతతో నూతన ఆవిష్కరణలు వస్తున్నాయన్నారు. ఉత్తరాంధ్ర వాసిగా ఎంతో సంతోష పడుతున్నానని అన్నారు మంత్రి. విశాఖను ఐటీ హబ్‌గా మార్చుతున్న సీఎం చంద్రబాబుకు, ఐటీ మంత్రి లోకేష్‌కు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు. గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు విశేష కృషి చేసిన సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్‌కు విశాఖ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు హోంమంత్రి అనిత.
గూగుల్ రాక ఏపీలో గేమ్ ఛేంజర్: యార్లగడ్డ
టెక్ ప్రపంచంలో ఏపీకి చారిత్రాత్మక రోజు అని ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట రావు అన్నారు. గూగుల్ క్లౌడ్‍తో ఏపీ ప్రభుత్వం కొత్త అధ్యాయాన్ని ప్రారంభించిందని తెలిపారు. గూగుల్ ఆంధ్రప్రదేశ్‍లో అడుగుపెట్టిందని.. డిజిటల్ ఇన్నోవేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో కొత్త అధ్యాయమని పేర్కొన్నారు. గూగుల్ రావడం ఆంధ్రప్రదేశ్‌లో గేమ్ చేంజర్ కాబోతుందని అన్నారు. మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ వచ్చిన తరువాత అనేక ఐటీ కంపెనీలు హైదరాబాద్‌కు క్యూ కట్టాయన్నారు. హైదరాబాద్‌ను స్వరూపం మార్చివేసిందని గుర్తుచేశారు. అదే విధంగా గూగుల్ రాకతో ఏపీలో కూడా ఐటీ రంగం మరింత ఊపు అందుకోనుందని యార్లగడ్డ వెంకటరావు ధీమా వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి..
గూగుల్‌తో ఏపీ ప్రభుత్వం చారిత్రక ఒప్పందం
ప్రధాని మద్దతుతోనే సాధ్యం.. గూగుల్‌తో ఒప్పందంపై సీఎం
Read Latest AP News And Telugu News