AP Assembly: ఉభయ సభల్లో 2025 -26 ఏపీ బడ్జెట్‌పై చర్చ..
ABN , Publish Date - Mar 03 , 2025 | 07:19 AM
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం 9 గంటలకు ప్రశ్నోత్తరాలతో ప్రారంభమవుతాయి. అనంతరం 2025 -26 ఏపీ బడ్జెట్‌పై చర్చ జరుగుతుంది. వివిధ కేటాయింపులు.. సంక్షేమానికి నిధులు.. తదితర అంశాలపై సభలో చర్చ జరుగుతుంది.
అమరావతి: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (AP Assembly Budget Sessions) సోమవారం ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్నాయి. అలాగే 10 గంటలకు శాసన మండలి సమావేశాలు ప్రారంభమవుతాయి. ఉభయ సభలు ప్రశ్నోత్తరాలతో ప్రారంభమవుతాయి. ఈ సందర్భంగా మంత్రి నారాయణ (Minister Narayana) మున్సిపల్ చట్ట సవరణ ఆర్డినెన్స్‌ను శాసన సభ ముందు ప్రవేశపెడతారు. అలాగే ఏపీ ఫిల్మ్ అండ్ టెలివిజన్‌పై యాన్యువల్ రిపోర్ట్‌ను మంత్రి దుర్గేష్ (Minister Durgesh) సభ ముందు ఉంచనున్నారు. ఇంకా ఇంధన శాఖల వార్షిక నివేదికలను ఆయా శాఖల మంత్రులు టిజి భరత్, గొట్టిపాటి రవికుమార్ (TG Bharath, Gottipati Ravikumar)లు సభలో ప్రవేశపెట్టనున్నారు. అనంతరం ఉభయ సభల్లో 2025 -26 ఏపీ బడ్జెట్‌పై చర్చ జరుగుతుంది. వివిధ కేటాయింపులు.. సంక్షేమానికి నిధులు.. తదితర అంశాలపై అసెంబ్లీలో చర్చ జరుగుతుంది.
ఈ వార్త కూడా చదవండి..
కాగా ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం 10 గంటలకు (ఫిబ్రవరి 24న) ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. (Governor Abdul Nazeer speech) గవర్నర్ ప్రసంగానికి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు (YSRCP MLAs) అడ్డుతగులుతూ.. నినాదాలు చేశారు. గత ఎనిమిది నెలల్లో ప్రభుత్వం సాధించిన ప్రగతి, అందిస్తున్న సంక్షేమం, 2047 లక్ష్యాలు, ఆర్థిక ఇబ్బందులు, తదితర అంశాలపై గవర్నర్ ప్రసంగించారు. 26న శివరాత్రి, 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కావడంతో ఆ రెండు రోజులు సభ జరగలేదు. తిరిగి 28న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌కు మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. అనంతరం సభ వాయిదా పడింది. మార్చి 1, 2 శని, ఆదివారాలు కావడంతో సభ జరగలేదు. తిరిగి సోమవారం (3వ తేదీ) బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఈ సమావేశాలు మార్చి 21వరకు జరుగుతాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
నాలుగు నిమిషాల్లో ఏటీఎంలో చోరీ
యూపీఎస్‌ను రద్దు చేయకుంటే ఉద్యమమే
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News