Chintamaneni: పగటిపూట రాంబాబు.. రాత్రుళ్లు కాంబాబు.. అంబటిపై చింతమనేని సెటైర్
ABN , Publish Date - Feb 14 , 2025 | 04:41 PM
Chintamaneni Prabhakar: వైసీపీ నేతలు వల్లభనేని వంశీ, అంబటి రాంబాబుపై ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తప్పు చేసిన వారి పట్ల చట్టం అమలు కాస్త ఆలస్యం అవుతుందేమో కానీ, చేసిన తప్పుల నుంచి ఎవరూ తప్పించుకోలేరని స్పష్టం చేశారు.

అమరావతి, ఫిబ్రవరి 14: వైఎస్సార్సీపీ నేత వల్లభనేని వంశీ అరెస్ట్‌పై దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ (MLA Chintamaneni Prabhakar) స్పందించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ఇవాళ వంశీ లోనికి వెళ్ళారని, రేపు కొడాలినాని వెళ్తారని, ఎల్లుండి మరో నేత వెళ్తారని అన్నారు. గన్నవరం తర్వాత గుడివాడ, బందరు ఇలా చాలా నియోజకవర్గాల్లో తప్పులు జరిగాయని.. వారి సంగతి ఎప్పుడు అని ప్రజలు కోరుతున్నారన్నారు. తప్పు చేసిన వారి పట్ల చట్టం అమలు కాస్త ఆలస్యం అవుతుందేమో కానీ, చేసిన తప్పుల నుంచి ఎవరూ తప్పించుకోలేరని స్పష్టం చేశారు. వంశీ ఏ తప్పూ చేయకుండానే గన్నవరం తెలుగుదేశం కార్యాలయం ధ్వంసం అయిందా అని ప్రశ్నించారు.
అక్రమ కేసులు, కక్షసాధింపు రాజకీయాలు, అధికార దుర్వినియోగం వైసీపీకే సాధ్యమని మండిపడ్డారు. పగటిపూట రాంబాబు, రాత్రులు కాంబాబు అయిన అంబటికి డీజీపీ ఎదురొచ్చి స్వాగతం పలకాలా అంటూ ఎద్దేవా చేశారు. అబ్బయ్య చౌదరి పేరుకి సాఫ్ట్‌వేర్ అని.. మనిషి హార్డ్‌వేర్ అని అన్నారు. అలాంటి క్రిమినల్ అయిన అబ్బయ్య చౌదరికి అంబటి వత్తాసు ఏంటి అని నిలదీశారు. తన పొలంలో తాను వ్యవసాయం చేయలేని పరిస్థితికి ఎందుకు దిగజారాడో అబ్బయ్య చౌదరి సమాధానం చెప్పగలరా అని అన్నారు.
Vamsi Arrest Case.. వల్లభనేని వంశీ అరెస్ట్ కేసులో కీలక పరిణామాలు
రాజీనామాకు సిద్ధం...
‘‘దెందులూరు ఘర్షణలో నా తప్పు ఉందని రుజువైతే రాజీనామాకు సిద్ధం. నా గురించి గంటా అరగంటా అంటూ మాట్లాడే అంబటి సర్టిఫికెట్ ఇస్తాడా? సుకన్య, సంజనల సర్దిఫికెట్ పొందిన అంబటి స్థాయి అందరికీ తెలుసు. నోరు ఉంది కదా అని ఆంబోతులా రంకెలు వేయటం ఇకనైనా మానుకోవాలి. ఇలా రంకలేస్తేనే ప్రజలు కాల్చి పెట్టిన వాతలు చూపించుకోలేని దుస్థితిలో వైసీపీ నేతలు ఉన్నారు. ఉద్దేశపూర్వకంగా నాతో గొడవ పెట్టుకుందాం అని అబ్బయ్య చౌదరి ట్రాప్‌లో నేను పడలేదు. పోలవరం కాల్వ బాధితులకు చెల్లించాల్సిన రూ.6కోట్లు ఎగ్గొట్టే కుట్రలో భాగంగానే నాతో గొడవకు ట్రాప్ పన్నారు’’ అంటూ వ్యాఖ్యలు చేశారు.
అంబటి, జగన్‌పై కేసు పెట్టాల్సిందే..
‘‘కోడెల కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆయన చావుకు కారణమైన వారి చర్యలకు నేను కేసు పెడతా. కోడెల శివప్రసాదరావు చనిపోవటానికి కారణమైన అంబటి రాంబాబు, జగన్‌లపై ఇప్పుడైనా 306 సెక్షన్ కింద కేసు పెట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా. కోడెల ఆత్మహత్యకు కారకుల్ని శిక్షించేలా కేసు నమోదుపై ముఖ్యమంత్రి చంద్రబాబును, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని కోరతా. కోడెలపై అక్రమంగా ఫర్నిచర్ దొంగతనం ఆరోపణలు చేశారు. నా ట్రస్టు ద్వారా కావాలంటే వంద ఫర్నీచర్లు కొనిస్తా. పోయిన కోడెల ప్రాణాన్ని వైసీపీ నేతలు తీసుకురాగలరా ?. కోడెల చావుకు కారకులు శిక్షించి తీరాలి’’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి...
కళ్యాణ మంటపంలోకి చొరబడిన చిరుత.. చివరకు..
School: స్కూళ్లో మత ప్రచారాలు.. తల్లిదండ్రుల ఆగ్రహం
Read Latest AP News And Telugu News