School: స్కూళ్లో మత ప్రచారాలు.. తల్లిదండ్రుల ఆగ్రహం
ABN , Publish Date - Feb 14 , 2025 | 03:44 PM
Eluru District: స్కూళ్లలో మత ప్రచారం తీవ్ర కలకలం రేపుతోంది. హిందూదేవుళ్లను కించపరుస్తూ ఏకంగా ప్రధానోపాధ్యాయుడే ప్రచారం చేయడం చర్చకు దారి తీసింది.

ఏలూరు జిల్లా, ఫిబ్రవరి 14: విద్య నేర్పించే గురువు అంటే అందరికీ ఎనలేని అభిమానం ఉంటుంది. స్కూళ్లో మంచి విద్యా బుద్దులు నేర్పిస్తూ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బంగారు బాట వేసేందుకు కృషి చేస్తుంటారు. అలాగే స్కూళ్లలో మతాలకు చోటు ఉండదు. ఏ మతం వారినైనా ఒకేలా చూస్తారు ఉపాధ్యాయులు. స్కూళ్లలో మత ప్రచాలరాలకు కూడా తావుండదు. కానీ ఓ స్కూళ్లో ఏకంగా ప్రధానోపాధ్యుడే మతప్రచరాలకు తెరలేపాడు. హిందూ దేవుళ్లను కించపరిచేలా బోధనలు చేయడం రచ్చకు దారి తీసింది. అంతే కాకుండా ఆడపిల్లల పట్ల కూడా అసభ్యంగా ప్రవర్తించాడు ఆ హెడ్మాస్టర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లాలో (Eluru District) ఈ ఘటన చోటు చేసుకుంది.
జిల్లాలోని జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం ఎంపీపీ స్కూల్‌లో ప్రధానోపాధ్యాయుడి మత ప్రచారాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ప్రభుత్వ అటెండెన్స్, మిడ్ డే మిల్స్ , ఇతర పుస్తకాలలో మతప్రచారాలకు చెందిన వ్యాఖ్యలు రాస్తున్న వైనం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. హిందూ దేవుళ్ళను కించపరుస్తూ విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నాడు సదరు ప్రధానోపాధ్యాయుడు. అంతేకాకుండా మధ్యాహ్న భోజనం బాగోవడం లేదని హెచ్‌ఏంకు చెప్పినా కొడుతున్నారని పిల్లలు ఆరోపణలు చేశారు. ఆడ పిల్లలతో అసభ్యకరంగా వ్యాఖ్యలు చేస్తున్నారని హెడ్మాస్టర్‌పై పిల్లల తల్లిదండ్రులు , పిల్లలు ఆరోపించారు. మతపరమైన అంశాలు పిల్లలకు బోధిస్తున్నారంటూ తోటి ఉపాధ్యాయులు చెప్తున్న పరిస్థితి.
AP Ministers Reaction on Vamsi Arrest: వంశీ అరెస్ట్‌పై టీడీపీ మంత్రుల రియాక్షన్.. రానున్న రోజుల్లో..
పిల్లలకు కనీసం ఫ్యానులు కూడా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఈ విషయాలు తెలుసుకున్న తల్లిదండ్రులు, గ్రామస్థులు పాఠశాలకు చేరుకున్నారు. అయితే అప్పటికే విషయం తెలుసుకున్న ప్రధానోపాధ్యాయుడు పాఠశాలకు సెలవు పెట్టి వెళ్లిపోయాడు. ఈ వ్యవహారాన్ని మండల విద్యాశాఖ అధికారికి చెప్పినా పట్టించుకోవడంలేదని, ప్రధానోపాధ్యాయుడికి ఎంఈఓ సహకరిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గతంలో ఇలానే జరిగితే హెడ్మాస్టర్‌ను గ్రామస్తులు తీవ్రంగా హెచ్చరించారు. అయినప్పటికీ ప్రధానోపాధ్యయుడి మారని తీరుపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి...
వేలంటైన్స్ డే స్పెషల్ ... లవ్ స్టార్స్
కళ్యాణ మంటపంలోకి చొరబడిన చిరుత.. చివరకు..
Read Latest AP News And Telugu News