Share News

AP Ministers Reaction on Vamsi Arrest: వంశీ అరెస్ట్‌పై టీడీపీ మంత్రుల రియాక్షన్.. రానున్న రోజుల్లో..

ABN , Publish Date - Feb 14 , 2025 | 02:54 PM

వైసీపీ మాజీ ఎమ్మెల్యే వంశీ అరెస్ట్‌పై హోం మంత్రి అనిత, మంత్రి సవిత స్పందించారు. చట్టం తనపని తాను చేసుకుపోతుందని, రానున్న రోజుల్లో మరిన్ని విషయాలు కూడా బయటపడతాయన్నారు.

AP Ministers Reaction on Vamsi Arrest: వంశీ అరెస్ట్‌పై టీడీపీ మంత్రుల రియాక్షన్.. రానున్న రోజుల్లో..
Vamsi

అమరావతి: చట్టం తనపని తాను చేసుకుపోతుందంటూ వైసీపీ మాజీ ఎమ్మెల్యే వంశీ అరెస్ట్‌పై మంత్రి సవిత స్పందించారు. టీడీపీ పార్టీ ఆఫీసుపై దాడి చేయడం, కేసుపెట్టిన వారిని బెదిరించడం వంటి చర్యలు దారుణం అని మండిపడ్డారు. దేవాలయం లాంటి అసెంబ్లీలో నందమూరి తారక రామారావు కూతురు, అప్పటి మాజీ ముఖ్యమంత్రి భార్యను ఘోరంగా అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రానున్న రోజుల్లో..

ట్రస్టు ద్వారా ఎంతో మందికి విద్యాదానం చేస్తూ, ఉపాధి చూపుతూ, వైద్యం అందిస్తూన్న భవనమ్మను నానా మాటలు అన్నారని ఫైర్ అయ్యారు. ఎక్కడయినా కరవు వస్తే చాలు ముందుండి ఆదుకునే భవనమ్మను అసెంబ్లీ సాక్షిగా అసభ్యకరంగా మాట్లాడారని, రాజకీయ భవిష్యత్తు ఇచ్చారనే కనీస కృతజ్ఞత లేకుండా, అలాంటి వారి కుటుంభంలోని మహిళలను వంశీ ఎంతో అవమానించారని, టీవీ చూస్తుంటే వారి అరాచకాలు ఇప్పడు ఒక్కోక్కటిగా బయటకు వస్తున్నాయని అన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని విషయాలు కూడా బయటపడతాయన్నారు.

మన పురాణాలే సాక్ష్యం

అసెంబ్లీలో నాటి సీఎం పైసాచిక ఆనందం పోందారని, మహిళలను అవమానించిన రాజ్యాలు కూలిపోయాయని.. దీనికి మన పురాణాలే సాక్ష్యం అని చెప్పుకొచ్చారు. చెల్లిని, తల్లిని ఎన్నికల్లో వాడుకోని వదిలేసాడు, బాబాయికి గొడ్డలి వేటు వేశారని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. అమరావతి మహళలకు సైతం నాడు అన్యాయం చేశారన్నారు.


కర్మ సిద్ధాంతం

వంశీ అరెస్ట్ విషయంలో కర్మ సిద్ధాంతం కనిపిస్తోందన్నారు హోం మంత్రి వంగలపూడి అనిత. వంశీ అరెస్ట్ అక్రమం అంటూ వైసీపీ నేతలు ఆందోళన చేస్తున్నారని, అయితే వంశీ అరెస్ట్ సక్రమమేని కామెంట్స్ చేశారు. అందుకు అన్ని ఆధారాలు ఉన్నాయని వివరించారు. అన్ని ఆధారాలు ఉన్నాకే కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నట్లు తెలిపారు.

కాగా, మంత్రి గుమ్మడి సంధ్యారాణి పీఎస్ఓ బ్యాగ్ మిస్ అవ్వడం దురదృష్టకరమని, నిర్లక్ష్యం వల్లనే బ్యాగ్ పోయిందని అన్నారు. అయినప్పటికీ ఈ అంశంపై ఎంక్వయిరీ జరుగుతుందని స్పష్టం చేశారు. బడ్జెట్‌కు సంబంధించి కేటాయింపు లపై ఆర్ధిక శాఖకు నివేదికను ఇచ్చామని, పోలిస్ శాఖలో వివిధ కేటాయింపు లపై ఆర్ధిక మంత్రితో చర్చ జరిగిందని, ఇలాంటి మీటింగ్ లు గత ప్రభుత్వంలో ఎప్పుడూ జరగలేదని పేర్కొన్నారు.

Also Read: యాసిడ్ దాడి ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్.. చెల్లికి అండగా ఉంటానన్న లోకేష్

Updated Date - Feb 14 , 2025 | 03:06 PM