CM Chandrababu Slams YSRCP: వైసీపీ అరాచకాలపై సీఎం చంద్రబాబు సంచలన ఆరోపణలు
ABN , Publish Date - Sep 25 , 2025 | 03:37 PM
స్పీకర్ అయ్యన్న పాత్రుడుపైనా అత్యాచారయత్నం కేసులు పెట్టారని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, మంత్రులు, ఎమ్మెల్యేలు ఇలా అందరూ గత పాలకులు పెట్టిన అక్రమకేసుల బాధితులే అని సీఎం చెప్పుకొచ్చారు.
అమరావతి, సెప్టెంబర్ 25: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో శాంతి భద్రతల అంశంపై స్వల్ప కాలిక చర్చలో ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) పాల్గొన్నారు. శాంతిభద్రతలు- సామాజిక మాధ్యమాల అంశంపై సీఎం ప్రసంగించారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజాస్వామ్యం గురించి పోరాడిన వారందరిపైనా కేసులు పెట్టారని తెలిపారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడుపైనా అత్యాచారయత్నం కేసులు పెట్టారన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ గత పాలకులు పెట్టిన అక్రమకేసుల బాధితులే అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. తనపై 17 కేసులు పెట్టి వేధించారని.. ఇది అరాచకానికి పరాకాష్ట అంటూ ఫైర్ అయ్యారు.
ఎన్నో వేధింపులు..
యువగళం పాదయాత్ర ద్వారా మంత్రి లోకేష్ ప్రజలను కలిస్తే కేసులు పెట్టారని.. ‘అంగళ్లులో గత పాలకులు నాపై దాడి చేసి తిరిగి నాపైనే కేసులు పెట్టారు’ అని గుర్తుచేశారు. ప్రజలతో మాట్లాడేందుకు సమావేశం ఏర్పాటు చేసుకుంటే కరెంటు తొలగించి వేధించారని మండిపడ్డారు. ఇప్పుడు మంత్రులుగా ఉన్న అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, బీసీ జనార్ధన్ రెడ్డి, సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర, జేసీ ప్రభాకర్ రెడ్డి, పులివర్తి నాని, నిమ్మల రామానాయుడు, దేవినేని ఉమ, బీటెక్ రవి, కూన రవి ఇలా నేతలందరిపై కేసులు పెట్టారని తెలిపారు సీఎం.
అందరిపైనా కేసులే..
గత ప్రభుత్వ హయాంలో అందరిపైనా కేసులు, వేధింపులే అని అన్నారు. రఘురామకృష్ణంరాజును అరెస్టు చేసినప్పుడు తమకు నిద్ర లేకుండా పోయిందని అప్పటి దారుణాలను సీఎం వివరించారు. అమరావతి రైతులు రాజధాని కోసం పోరాడుతుంటే.. స్నానాలు చేసే బాత్ రూమ్‌లపై డ్రోన్లు ఎగరేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పాదయాత్రలోనూ అడుగడుగునా అడ్డంకులు కల్పించారన్నారు. వీళ్ల అరాచకాలు భరించలేక పారిశ్రామిక వేత్తలు కూడా రాష్ట్రం నుంచి పారిపోయారని తెలిపారు. అప్పటి గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ తన పరిశ్రమను పొరుగు రాష్ట్రానికి తీసుకెళ్లిపోయారని.. రాజకీయాల నుంచి కూడా తప్పుకున్నారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
వారినే భయపెట్టేశారు..
సింగపూర్ ప్రభుత్వం ప్రపంచంలోనే అంత్యంత గౌరవప్రదమైనదన్నారు. చివరకు ట్రంప్, కిమ్‌కు చర్చలు సింగపూర్‌లో పెట్టారని తెలిపారు. సింగపూర్‌లో నైట్ క్లీనింగ్ చూసి హైదరాబాద్‌లో ప్రవేశపెట్టినట్లు గుర్తుచేశారు. 2014 ఎన్నికల్లో రాజధానిని కడతామని చెప్పామని.. సింగపూర్‌కు సమానంగా కడతామని తెలిపారు. అక్కడి ప్రభుత్వం మాస్టర్ ప్లాన్‌ను ఫ్రీగా చేసి ఇచ్చిందని.. అలాంటి వాళ్లను వీళ్లు బయపెట్టారంటూ వైసీపీపై సీఎం చంద్రబాబు నాయుడు విరుచుకుపడ్డారు.
ఇవి కూడా చదవండి..
శాంతిభద్రతలపై చర్చ... అయ్యన్న కీలక కామెంట్స్
మంత్రి సమాధానంతో అసంతృప్తి.. మండలి నుంచి బొత్స వాకౌట్
Read Latest AP News And Telugu News