MLA Balakrishna: హిందూపురంలో పరిశ్రమల హబ్ ఏర్పాటు చేయండి..
ABN , Publish Date - Sep 25 , 2025 | 01:58 PM
హిందూపురం నియోజకవర్గంలో స్మాల్‌స్కేల్ ఇండస్ర్టీస్ హబ్ ఏర్పాటు చేయాలని మంత్రి కొండపల్లి శ్రీనివాసులును ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కోరారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లిని ఆయన చాంబర్‌లో ఎమ్మెల్యే కలిశారు.
- మంత్రి కొండపల్లికి ఎమ్మెల్యే బాలకృష్ణ వినతి
హిందూపురం: హిందూపురం నియోజకవర్గంలో స్మాల్‌స్కేల్ ఇండస్ర్టీస్ హబ్ ఏర్పాటు చేయాలని మంత్రి కొండపల్లి శ్రీనివాసులును ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(MLA Nandamuri Balakrishna) కోరారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లిని ఆయన చాంబర్‌లో ఎమ్మెల్యే కలిశారు. తన నియోజకవర్గంలో పరిశ్రమల ఏర్పాటుకు కావాల్సినంత భూమి ఉందని తెలిపారు. అంతర్జాతీయ విమానాశ్రయానికి కేవలం 75 కి.మీ. దూరంలో, చిలమత్తూరు(Chilamattur) వద్ద పరిశ్రమల ఏర్పాటుకు అనువైన భూమి ఉందని తెలిపారు.

చిలమత్తూరు మండల పరిధిలో రెండు జాతీయ రహదారులు ఉన్నాయని, రాజధాని అమరావతికి గ్రీన్‌ఫిల్డ్ హైవేని నిర్మిస్తున్నారని తెలిపారు. పరిశ్రమలను అభివృద్ధి చేయడానికి సదుపాయాలు పుష్కలంగా ఉన్నాయని అన్నారు. పరిశ్రమలు ఏర్పాటైతే జిల్లాలో యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బంగారం ధరలో స్వల్ప తగ్గుదల.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News