Ayyanna Patrudu AP Assembly: శాంతిభద్రతలపై చర్చ... అయ్యన్న కీలక కామెంట్స్
ABN , Publish Date - Sep 25 , 2025 | 01:15 PM
సభాపతిగా నేను ఈ కుర్చీలో కుర్చున్నా నాకు కూడా కొంత ఆవేదన కలుగుతుంది. ప్రెస్ మీట్, సోషల్ మీడియాలో రోజు చూస్తున్నాం వారు మాట్లాడే తీరు. మళ్లీ మేమే వస్తాం మీ అంతుచూస్తాం, పీకలు కోస్తాం... రప్ఫా రప్ఫా అంటూ సినిమా డైలాగులు చెబుతున్నారని అయ్యన్నపాత్రుడు అన్నారు.
అమరావతి, సెప్టెంబర్ 25: రాష్ట్రంలో శాంతిభద్రతలపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు (Speaker Ayyanna Patrudu) కీలక వ్యాఖ్యలు చేశారు. ‘సభాపతిగా నేను ఈ కుర్చీలో కుర్చున్నా నాకు కూడా కొంత ఆవేదన కలుగుతోంది. ప్రెస్ మీట్, సోషల్ మీడియాలో రోజు చూస్తున్నాం వారు మాట్లాడే తీరు. మళ్లీ మేమే వస్తాం మీ అంతుచూస్తాం, పీకలు కోస్తాం... రప్పా రప్పా అంటూ సినిమా డైలాగులు. ఎన్టీఆర్ పార్టీలోనే మేము కూడా ఓడిపోలేదా.... ఓడిపోతే రప్పా రప్పా నా.... ఇందిరాగాంధీ వంటి మహనాయకురాలు ఓడిపోలేదా. మీలా మాట్లాడలేను ఆవేశం వస్తుంది.. అయితే కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుంది’ అంటూ వ్యాఖ్యలు చేశారు.
ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు వస్తాయని.. అయితే ప్రతిపక్షంగా ప్రభుత్వ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లడంలో లోటుపాట్లు ఉంటే అసెంబ్లీకి వచ్చి చెప్పాలని సూచించారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని... ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి ఇక్కడ ఉంటారని తెలిపారు. సభకు రారు, ఎమ్మెల్యేలను రానివ్వరు... క్వశ్చన్‌లు మాత్రం పంపుతున్నారని.. ప్రజలు దీన్ని ఖండిచాల్సిన అవసరం ఉందన్నారు. ‘రాజకీయ కారణాలతో కొంతమంది సభ్యులు వెళ్లిపోతే.. ఆయన తనకు నెంబర్ లేదని సభకు వచ్చి ప్రతిపక్షనేతగా రాజీనామా ఇచ్చేశారు. ఇప్పుడు నెంబర్ లేకుండా నాకెందుకు ఇవ్వరు అంటున్నారు. చివరకు నాపై హైకోర్టుకు వెళ్లారు.... ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్లారు. నేను ఎక్కువ మాట్లాడలేను.. అయినా మాట్లాడాలి అనిపించింది. పిల్లల భవిష్యత్తు.. రాష్ట్ర భవిష్యత్త కోసం అందరూ పనిచేయాలి’ అని స్పీకర్ అయ్యన్నపాత్రుడు పిలుపునిచ్చారు.
కాగా.. శాసనసభలో రాష్ట్రంలో శాంతి భద్రతలు అంశంపై చర్చను గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ రావు ప్రారంభించారు. గత ప్రభుత్వ హయాంలో రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేశారని విమర్శించారు. సామాన్య ప్రజల ప్రాధమిక హక్కులను హరించారని మండిపడ్డారు. పల్నాడులో రాజకీయ కక్షతో హత్యలు చేశారని గుర్తుచేశారు. చంద్రయ్యను పట్టపగలు నడి రోడ్డు పై హత మార్చారని తెలిపారు. అందుకనే వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు మట్టి కరిపించారంటూ యరపతినేని వ్యాఖ్యలు చేశారు.
ఇవి కూడా చదవండి..
మంత్రి సమాధానంతో అసంతృప్తి.. మండలి నుంచి బొత్స వాకౌట్
లిక్కర్ స్కామ్‌లో మాజీ సీఎం కొడుకు అరెస్ట్..ఇక తర్వాత..
Read Latest AP News And Telugu News