Botsa Walkout: మంత్రి సమాధానంతో అసంతృప్తి.. మండలి నుంచి బొత్స వాకౌట్
ABN , Publish Date - Sep 25 , 2025 | 12:13 PM
కూటమి మోసపూరితమైన మాటలు నమ్మి ప్రజలు కూటమి ప్రభుత్వానికి ఓటు వేశారంటూ బొత్స వ్యాఖ్యలు చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఉద్యోగులను , ప్రజలను కూటమి ప్రభుత్వం విస్మరించిందన్నారు.
అమరావతి, సెప్టెంబర్ 25: ఏపీ శాసనమండలిలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఉద్యోగుల సమస్యలపై మంత్రి పయ్యావుల కేశవ్ (Minister Payyavula Keshav) ఇచ్చిన సమాధానంపై విపక్ష నేత బొత్స సత్యనారాయణ అసంతృప్తి వ్యక్తం చేశారు. కూటమి మోసపూరితమైన మాటలు నమ్మి ప్రజలు కూటమి ప్రభుత్వానికి ఓటు వేశారంటూ వ్యాఖ్యలు చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఉద్యోగులను , ప్రజలను కూటమి ప్రభుత్వం విస్మరించిందన్నారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఉద్యోగుల ఆవేదనకు మద్దతు తెలుపుతూ సభ నుంచి వాకౌట్ చేస్తున్నామంటూ బొత్స సత్యనారాయణ సభ నుంచి వెళ్లిపోయారు.
అంతకుముందు మంత్రి పయ్యావుల ఉద్యోగుల సమస్యలపై మాట్లాడుతూ గత ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగుల పట్ల గత సర్కార్ దుర్మర్గంగా వ్యవహరించిందన్నారు. ఉద్యోగుల జీపీఎఫ్‌ను వివిధ అవసరాలకు వాడుకుని... ఇప్పుడు ఉద్యోగుల విషయంలో మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం ఉద్యోగులకు రివర్స్ పీఆర్సీ ఇచ్చిందన్నారు.ఐఆర్ కంటే తక్కువగా 23 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చి అన్యాయం చేశారని.. కరోనా పేరు చెబుతూ ఉద్యోగుల ఫిట్‌మెంట్‌ను వైసీపీ సర్కార్ తగ్గించిందని విమర్శించారు.
ఉద్యోగుల పట్ల కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉందని స్పష్టం చేశారు. ఉద్యోగులకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిల చెల్లింపునకు దశలవారీగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం విషయంలో కూటమి ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలిపారు. ఉద్యోగుల వేతనాల పెంపు కోసం పీఆర్సీ కమిషన్ నియామకంపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని చెప్పారు. సరైన సమయంలో సీఎం చంద్రబాబు పీఆర్సీ నియామకంపై చర్యలు తీసుకుంటారని మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
లిక్కర్ స్కామ్‌లో మాజీ సీఎం కొడుకు అరెస్ట్..ఇక తర్వాత..
కడప ఇన్‌ఛార్జి మేయర్‌గా ముంతాజ్ బేగం
Read Latest AP News And Telugu News