Share News

Kadapa New Mayor: కడప ఇన్‌ఛార్జి మేయర్‌గా ముంతాజ్ బేగం

ABN , Publish Date - Sep 25 , 2025 | 11:03 AM

డిప్యూటీ మేయర్‌గా ఉన్న ముంతాజ్‌ బేగంకు ఇన్‌ఛార్జి మేయర్‌ బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర మున్సిపల్‌ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా.. మేయర్ సురేష్ బాబుపై కూటమి ప్రభుత్వం అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే.

Kadapa New Mayor: కడప ఇన్‌ఛార్జి మేయర్‌గా ముంతాజ్ బేగం
Kadapa New Mayor

అమరావతి, సెప్టెంబర్ 25: కడప ఇన్‌ఛార్జ్ మేయర్‌‌గా ముంతాజ్ బేగంకు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రస్తుతం డిప్యూటీ మేయర్‌గా ఉన్న ముంతాజ్‌ బేగంకు ఇన్‌ఛార్జి మేయర్‌ బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర మున్సిపల్‌ శాఖ ఈరోజు (గరువారం) ఉత్తర్వులు జారీ చేసింది. కాగా.. మేయర్ సురేష్ బాబుపై కూటమి ప్రభుత్వం అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. నిబంధనలకు విరుద్ధంగా మేయర్ సురేష్ బాబు తన కుటుంబ సభ్యుల పేరుతో కాంట్రాక్టు పనులు చేసినందుకు గాను.. ఆయనను మేయర్ పదవి నుంచి తొలగిస్తూ రాష్ట్ర పురపాలక శాఖ ఉత్తర్వులు ఇచ్చింది.


ఈ క్రమంలో తనపై ప్రభుత్వం వేసిన అనర్హత పిటిషన్‌ను సవాల్ చేస్తూ కడప మాజీ మేయర్ సురేష్ బాబు ఏపీ హైకోర్టులో (AP High Court) పిటిషన్ దాఖలు చేశారు. అనర్హత పిటిషన్‌పై ఈరోజు (గురువారం) హైకోర్టులో విచారణ జరుగనుంది.


అయితే గతంలో సురేష్ బాబుపై అనర్హత వేటు వేసింది ప్రభుత్వం. కానీ సురేష్ బాబు హైకోర్టును ఆశ్రయించడంతో ఓ సారి అవకాశం ఇచ్చింది. తాజాగా సురేష్ బాబుపై వచ్చిన ఆరోపణలు నిజమని నిర్ధారణ కావడంతో మరోసారి ఆయనపై కూటమి ప్రభుత్వం అనర్హత వేటు వేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. సురేష్ బాబు కుటుంబీకులు కడప నగర పాలక సంస్థలో సివిల్ కాంట్రాక్టులు చేపట్టారని ఎమ్మెల్సీ మాధవిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో ఈ వ్యవహారం బయటపడింది. దీనిపై విజిలెన్స్ విచారణ చేపట్టగా.. అది నిజమే అని తేలింది. దీంతో ఈ ఏడాది మార్చిలో సురేష్‌ బాబుకు నోటీసులు ఇచ్చిన ప్రభుత్వం.. మేలో పదవి నుంచి తొలగించింది. తనపై అనర్హత పిటిషన్ వేయడాన్ని సవాల్ చేస్తూ సురేష్ బాబు హైకోర్టును ఆశ్రయించారు. తనపై ఉద్దేశపూర్వకంగానే ఆరోపణలు చేసి పదవి నుంచి తప్పించారని కోర్టులో పిటిషన్ వేశారు. కోర్టులో వాదనలు జరుగగా.. సురేష్ బాబు కోరిక మేరకు మరోసారి అవకాశం ఇవ్వాల్సిందిగా హైకోర్టు ఆదేశించింది. కోర్టు సూచనల మేరకు సురేష్ బాబుకు అవకాశం ఇచ్చినప్పటికీ... తాజాగా ఆయనపై వచ్చిన ఆరోపణలు నిజమని తేలడంతో మేయర్ పదవి నుంచి తొలగిస్తూ రెండు రోజుల క్రితం మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.


ఇవి కూడా చదవండి..

నేటి అలంకారం శ్రీ కాత్యాయనీ దేవి

లిక్కర్ స్కామ్‌లో మాజీ సీఎం కొడుకు అరెస్ట్..ఇక తర్వాత..

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 25 , 2025 | 05:07 PM