Share News

AP Assembly New Building: అసెంబ్లీ ప్రాంగణంలో 16 క్యాబిన్లతో ఆధునిక భవనం.. ప్రారంభించిన స్పీకర్

ABN , Publish Date - Sep 25 , 2025 | 10:30 AM

అసెంబ్లీ సమీపంలో చీఫ్ విప్, విప్‌ల కోసం కార్యాలయాలు సిద్ధమయ్యాయి. భవనం కింద అంతస్తులో మీడియా పాయింట్, డైనింగ్‌ హాలును ఏర్పాటు చేశారు. ఈ భవనాన్ని స్పీకర్ ప్రారంభించారు.

AP Assembly New Building: అసెంబ్లీ ప్రాంగణంలో 16 క్యాబిన్లతో ఆధునిక భవనం.. ప్రారంభించిన స్పీకర్
AP Assembly New Building

అమరావతి, సెప్టెంబర్ 25: ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో అదనపు భవన సముదాయన్ని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు (AP Assemly Speaker Chintakayala Ayyannapatrudu) ఈరోజు (గురువారం) ఉదయం లాంఛనంగా ప్రారంభించారు. అసెంబ్లీ సమీపంలో చీఫ్ విప్, విప్‌ల కోసం కార్యాలయాలు సిద్ధం చేశారు. భవనం కింద అంతస్తులో మీడియా పాయింట్, డైనింగ్‌ హాలును ఏర్పాటు చేశారు. ఈ భవనాన్ని స్పీకర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ, మంత్రి పయ్యావుల కేశవ్, చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. పూర్తి నిర్లక్ష్యంగా ఉన్న భవనాన్ని స్పీకర్ ఈ స్థితికి తీసుకొచ్చారన్నారు. శాసన వ్యవస్థ సచివాలయం తరపున స్పీకర్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నామని ప్రసన్న కుమార్ తెలిపారు.


16 క్యాబిన్‌లతో ఆధునీకరణ: స్పీకర్

చీఫ్ విప్‌లకు విప్‌లకు రూమ్‌లు కేటాయించామమని స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్నారు. రూ.3 కోట్ల 57 లక్షలతో ఈ భవనాన్ని 16 క్యాబిన్‌లతో ఆధునీకరించినట్లు చెప్పారు. నిర్మాణం విషయంలో మంత్రి నారాయణ ఎంతో శ్రద్ధ తీసుకున్నారన్నారు. మీడియాకు సిట్టింగ్‌కు ఇతర సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించామని వెల్లడించారు. భవన నిర్మాణ దశలను సెక్రటరీ జనరల్ నిత్యం పర్యవేక్షణ చేశారని.. ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల కేశవ్ ఇబ్బందులు ఉన్నా తమ విషయం వచ్చినప్పుడు కాస్త లిబరల్‌ గా ఉండాలని కోరారు.


తక్కువలో పూర్తి: నారాయణ

ఈ బిల్డింగ్‌ను ఎస్టిమేషన్ కన్నా తక్కువలో పూర్తి చేయగలిగామని మంత్రి నారాయణ తెలిపారు. విప్‌లకు 16 ఛాంబర్‌లు, డైనింగ్, మీడియా పాయింట్ ఏర్పాటు చేశామన్నారు. కాంట్రాక్ట్ తీసుకున్న వ్యక్తి కాస్త ఆలస్యం చేయడంతో వారితో చెప్పి తొందరగా పూర్తి చేశామని అన్నారు.


ఆ లక్ష్యానికి ఇదే పునాది: పయ్యావుల

ఎక్కడా దుబారా ఉండకూడదని ఈ ప్రభుత్వం భావిస్తుందని... ఆ పనిని శాసనసభ వ్యవస్థ నుంచే ప్రారంభించామని ..శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. ఐదు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అనుకున్న భవనాన్ని మూడున్నర కోట్లలోనే పూర్తి చేయగలిగామన్నారు. ప్రభుత్వ లెక్కలకు జవాబుదారీగా శాసన వ్యవస్థ ఉంటుందని స్పష్టం చేశారు. ఒక్క రూపాయి కూడా దుబారా చేయకూడదనే తమ లక్ష్యానికి ఈ భవన నిర్మాణంతోనే పునాది వేశామని మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

నేటి అలంకారం శ్రీ కాత్యాయనీ దేవి

లిక్కర్ స్కామ్‌లో మాజీ సీఎం కొడుకు అరెస్ట్..ఇక తర్వాత..

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 25 , 2025 | 11:50 AM