CM Chandrababu On Teachers Day: ఉపాధ్యాయులకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు..
ABN , Publish Date - Sep 05 , 2025 | 06:57 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యారంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని సీఎం చంద్రబాబు తెలిపారు. విద్యాశాఖలో తీసుకురావాల్సిన సంస్కరణలపై అధ్యయనం చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
విజయవాడ: డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆదర్శాల నుంచి ఎందరో స్ఫూర్తి పొందుతున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. సర్వేపల్లి జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు. విజయవాడలోని ఏ1 కన్వెన్షన్ హాల్‌లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ముఖ్యఅతిథులుగా సీఎం చంద్రబాబు హాజరయ్యారు. టీచర్లందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు..
ఇంటర్ చదువుతున్నప్పుడే పోటీ పరీక్షలకు ప్రిపేర్ చేసేలా విద్యార్థులను సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌కు సూచించారు. హాస్టళ్లతో విద్యాశాఖ సమన్వయం చేసుకుంటూ విద్యార్థులను పోటీ పరీక్షలకు ప్రిపేర్ చేయాలని ఆదేశించారు. ఇటీవల ఐఐటీలకు వెళ్లిన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు తనను కలిశారని గుర్తు చేశారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదువుకునే విద్యార్థులను ప్రతిష్టాత్మక జాతీయ విద్యా సంస్థల్లో అడ్మిషన్లు సాధించేలా తీర్చిదిద్దాలని తెలిపారు.
ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్‌లో ఆంధ్ర యూనివర్సిటీకి నాలుగో ర్యాంక్ రావడం శుభపరిణామమని హర్షం వ్యక్తం చేశారు. ఇలాంటివి మరిన్ని రావాలని ఆకాంక్షిస్తున్నట్లు స్పష్టం చేశారు. పిల్లల్లో విజ్ఞాన జ్యోతులు వెలిగిస్తున్న వారందరికీ అభినందనలు తెలిపారు. అంకితభావంతో పనిచేస్తూ ముందుతరాలకు మార్గదర్శులు కావాలని టీచర్లకు సూచించారు. ఈ సమావేశంలో మంత్రులు నారా లోకేష్, సత్యకుమార్ యాదవ్, ప్రజా ప్రతినిధులు తదితరులు హాజరయ్యారు.
ఈ వార్తలు కూడా చదవండి
జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో అమరావతి నష్టపోయింది: పీవీఎన్ మాధవ్
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆశయాలు స్ఫూర్తి: సీఎం చంద్రబాబు