Share News

Savitha On BC Study Circles: భవిష్యత్‌లో బీసీ స్టడీ సర్కిళ్లు బలోపేతం

ABN , Publish Date - Sep 17 , 2025 | 04:43 PM

భవిష్యత్తులో బీసీ స్టడీ సర్కిళ్లు బలోపేతం చేస్తామని మంత్రి సవిత స్పష్టం చేశారు. నిరుద్యోగులకు ఉచిత శిక్షణతో ఉద్యోగాలు వచ్చేలా చేసినందుకు బీసీ సంక్షేమ శాఖకు స్కోచ్ అవార్డు వచ్చిందన్నారు.

Savitha On BC Study Circles: భవిష్యత్‌లో బీసీ స్టడీ సర్కిళ్లు బలోపేతం
Savitha On BC Study Circles

అమరావతి, సెప్టెంబర్ 17: బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా బీసీ అభ్యర్థులకు డీఎస్సీ అభ్యర్థులకు శిక్షణ ఇచ్చామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత(Minister Savitha) అన్నారు. బుధవారం నాడు మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. 1674 మందికి బీసీ స్టడీ సర్కిళ్లలో ఆఫ్ లైన్‌లో, 4770 మందికి ఆన్ లైన్ ద్వారా శిక్షణ ఇచ్చామని తెలిపారు. మొత్తం 6470 మందికి బీసీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇచ్చామన్నారు. డీఎస్సీలో 246 మంది అభ్యర్థులు డీఎస్సీ ద్వారా టీచర్లుగా ఎంపికయ్యారన్నారు. బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా సివిల్ సర్వీసెస్, గ్రూప్స్, ఆర్ఆర్బీకి ఉచిత కోచింగ్ ఇచ్చామని చెప్పారు.


భవిష్యత్తులో బీసీ స్టడీ సర్కిళ్లు బలోపేతం చేస్తామని స్పష్టం చేశారు. నిరుద్యోగులకు ఉచిత శిక్షణతో ఉద్యోగాలు వచ్చేలా చేసినందుకు బీసీ సంక్షేమ శాఖకు స్కోచ్ అవార్డు వచ్చిందన్నారు. ఈనెల 20న బీసీ వెల్ఫేర్ శాఖ అధికారులు అవార్డు తీసుకోబోతున్నారన్నారు. జాతీయ స్థాయిలో స్కోచ్ అవార్డు రావడం ఆనందంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. నారా లోకేష్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నారని మంత్రి వెల్లడించారు.


వాటిపై చర్చకు సిద్ధం

‘నా పేరుతో మార్ఫింగ్ పెట్టి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు. వైసీపీ నేతల చీప్ ట్రిక్స్‌ను చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు. నాపై సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులపై పోలీసులకు ఫిర్యాదు చేశా. వైసీపీ నేతలు చీప్‌గా వ్యవహరించడాన్ని ఆపాలి. పీపీ విధానంలో ప్రభుత్వం నిర్మిస్తుంటే... ప్రైవేటుపరం అంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. మెడికల్ కళాశాలలపై చర్చించేందుకు మేము సిద్దంగా ఉన్నాం. తిరుమలలో దర్శనాల పేరిట వైసీపీ నేత రోజా అక్రమంగా దందాలన్నీ చర్చించేందుకు సిద్దం. ఐదేళ్లపాటు వైసీపీ నేత రోజా చేసిన అవినీతి అక్రమాలపై చర్చకు సిద్ధం. ఈ సారైనా పులివెందుల ఎమ్మెల్యే అసెంబ్లీకి రావాలి. వైసీపీ నేతలంతా కలసి పులివెందుల ఎమ్మెల్యేని అసెంబ్లీకి పంపాలి. పులివెందుల ఎమ్మెల్యే అసెంబ్లీకి వస్తే మాట్లాడేందుకు మైక్ ఇస్తాం. ఏ అంశంపైనా సరే అసెంబ్లీలో చర్చించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. యూరియా, మెడికల్ కళాశాలలు, వివేకా గొడ్డలి వేటుపై చర్చించేందుకు మేము సిద్ధం. సూపర్ సిక్స్ అమలు చేసి సూపర్ హిట్ చేశాం. మళ్లీ అమరావతి రాజధాని అంటూ మోసం చేసేందుకు వైసీపీ వారు డ్రామా ఆడుతున్నారు. తిరుపతిలో పదేళ్లుగా విగ్రహం అక్కడే ఉందని తెలిసినా వైసీపీ వాళ్లు దుష్ర్పచారం చేస్తున్నారు’ అంటూ మంత్రి సవిత ఫైర్ అయ్యారు.


ఇవి కూడా చదవండి...

ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి

మీరు దీర్ఘాయుష్షుతో ఉండాలి.. ప్రధానికి పవన్ బర్త్‌డే విషెస్

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 17 , 2025 | 05:07 PM