AP News: సీఎం చంద్రబాబు ఈ కేసును ప్రత్యేకంగా దర్యాప్తు జరపాలి: ఆయేషా మీరా తల్లిదండ్రులు
ABN , Publish Date - Jun 27 , 2025 | 09:54 PM
తమ మత సంప్రదాయాల ప్రకారం కొంత మెటీరియల్ ఇవ్వాలని కోరిన సీబీఐ అధికారులు ఇవ్వలేదని అయేషా మీరా తల్లిదండ్రులు చెప్పారు. తమ బిడ్డను ఆనాడు దారుణంగా హత్య చేశారని అయేషా మీరా తల్లిదండ్రులు తెలిపారు.
అమరావతి: బీఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా తల్లిదండ్రుల (Ayesha Meera Parents) పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో (AP High Court) ఇవాళ(శుక్రవారం) విచారణ జరిగింది. నివేదిక కోసం సీబీఐ కోర్టులో దరఖాస్తు చేసుకోవాలని న్యాయస్థానం సూచించింది. తుది నివేదికలో వివరాలు వెల్లడించాలని అనుబంధ పిటిషన్‌ని ఆయేషా తల్లిదండ్రులు వేశారు. కౌంటర్ దాఖలు చేశామని, కోర్టు ఫైలులోకి చేరలేదని సీబీఐ వెల్లడించింది. అయేషా మీరా తల్లితండ్రుల తరపున వాదనలను న్యాయవాది పిచ్చుక శ్రీనివాస్ వినిపించారు. ఈ కేసు విచారణ జులై నాలుగో తేదీకి హైకోర్టు వాయిదా వేసింది.
ఆనాడు దారుణంగా హత్య చేశారు: అయేషా మీరా తల్లిదండ్రులు
మరోవైపు.. తమ మత సంప్రదాయాల ప్రకారం కొంత మెటీరియల్ ఇవ్వాలని కోరిన సీబీఐ అధికారులు ఇవ్వలేదని అయేషా మీరా తల్లిదండ్రులు చెప్పారు. తమ బిడ్డను ఆనాడు దారుణంగా హత్య చేశారని తెలిపారు. అప్పటి పోలీసులు సరిగ్గా విచారణ చేయలేదని అన్నారు. సీబీఐ ఐదేళల్లో ఈ కేసుని విచారణ చేయాల్సి ఉండగా ఎనిమిదేళ్లు చేశారని చెప్పారు. కేసు కూడా బైఫర్‌ఫికేషన్ చేశామని విశాఖపట్నం పంపారని గుర్తుచేశారు. సీబీఐ విచారణపై కోర్టులో పిటిషన్ కూడా వేశామని అన్నారు. ఈనెల 22వ తేదీన విచారణ పూర్తి చేశామని సీబీఐ కోర్టు మూడు నివేదికలు ఇచ్చిందని వెల్లడించారు. ఈ నివేదికలు కావాలంటే .. సీబీఐ కోర్టులో పిటిషన్ వేసి నివేదిక తేవాలని అంటున్నారని చెప్పారు అయేషా మీరా తల్లిదండ్రులు.
సీబీఐ విచారణ అసలు తాము కోరలేదని.. అప్పుడు ప్రభుత్వం వేసిందని అయేషా మీరా తల్లిదండ్రులు గుర్తుచేశారు. రీ పోస్టుమార్టం చేసిన నివేదిక కూడా తమకు తెలియపరచలేదని చెప్పారు. కోర్టుకు కూడా ఈ విషయం చెప్పకుండా దాచారని అన్నారు. తమకు నివేదిక ఇవ్వాల్సిన బాధ్యత సీబీఐకి ఉందన్నారు. ఇప్పుడు తమకు న్యాయం జరగాలంటే ఏపీ సీఎం చంద్రబాబు ఈ కేసును ప్రత్యేకంగా దర్యాప్తు జరపాలని కోరారు. ఆడపిల్లలకు రక్షణ కల్పిస్తామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయని అన్నారు. మరి పాపకు జరిగిన అన్యాయంపై దోషులు ఎవరో తేలలేదని చెప్పారు. ప్రభుత్వం స్పందించి తమ పాపను చంపిన నిజమైన హంతకులను శిక్షించాలని అయేషా మీరా తల్లిదండ్రులు కోరారు.
సీబీఐ దర్యాప్తులో విఫలమైందనే అనుమానం ఉంది: న్యాయవాది పిచ్చుక శ్రీనివాస్
అయేషా మీరా హత్యను విచారణ చేసిన సీబీఐ దర్యాప్తు నివేదికను తమకు ఇవ్వాలని ఏపీ హైకోర్టులో అయేషా మీరా తల్లిదండ్రులు పిటీషన్ దాఖలు చేశారని న్యాయవాది పిచ్చుక శ్రీనివాస్ తెలిపారు. సీబీఐ దాఖలు చేసిన కౌంటర్‌లో నివేదిక ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పారని... అంటే ఈ దర్యాప్తులో సీబీఐ విఫలమైందనే అనుమానం తమకు కలుగుతోందని అన్నారు. ఈ కేసు విచారణ జులై నాలుగో తేదీకి హైకోర్టు వాయిదా వేసిందని తెలిపారు. అసలు విచారణ నిష్పక్షపాతంగా చేశారా లేదా అనే ఆందోళన ఉందని న్యాయవాది పిచ్చుక శ్రీనివాస్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
AP Tourism: పర్యాటక రంగం.. సీఎం సూచనలతోనే ముందుకు: మంత్రి దుర్గేష్
సింగయ్య మృతి కేసు.. జగన్ వాహనం చెకింగ్
Read Latest AP News And Telugu News