AP Liquor Scam: నన్ను ఇరికించిన వారిని వదలను.. కోర్టు ఆవరణలో చెవిరెడ్డి కారుకూతలు..
ABN , Publish Date - Sep 12 , 2025 | 03:59 PM
ఈ కేసులో న్యాయపరమైన అంశాలు ఏమి తనకు తెలీదని సజ్జల శ్రీధర్ రెడ్డి స్పష్టం చేశారు. 140 రోజులుగా తాను జైల్లో ఉన్నానని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లి తండ్రులను తానే చూసుకోవాలని పేర్కొన్నారు.
విజయవాడ: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మద్యం కేసు నిందితులకు ఈనెల 18వ తేదీ వరకూ రిమాండ్ పొడిగించింది ఏసీబీ కోర్టు. ఈ మేరకు సిట్ అధికారులు రిమాండ్ ఖైదీలుగా ఉన్న వారిని జైళ్లకు తరలించారు. కాగా, ఎంపీ మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించినట్లు సమాచారం. అయితే ఏసీబీ కోర్టులో విచారణ సమయంలో సజ్జల శ్రీధర్ రెడ్డి తన వాదనలను న్యాయమూర్తికి విన్నవించారు.
ఈ కేసులో న్యాయపరమైన అంశాలు ఏమీ తనకు తెలీదని సజ్జల శ్రీధర్ రెడ్డి స్పష్టం చేశారు. 140 రోజులుగా తాను జైల్లో ఉన్నానని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లి తండ్రులను తానే చూసుకోవాలని పేర్కొన్నారు. ఇండిపెండెంట్‌గా ఉంటానని.. విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోవాలని సజ్జల శ్రీధర్ రెడ్డి కోరారు. వాదనలు విన్న న్యాయస్థానం ఈనెల 18వ తేదీ తరువాత మరోసారి విచారణ చేపడతామని వెల్లడించింది.
అయితే ఏసీబీ కోర్టు దగ్గర చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరోసారి హడావుడి చేశారు. కోర్టు నుంచి బయటకు వచ్చే సమయంలో తానేమీ తప్పు చేయలేదని అన్నారు. మద్యం కుంభకోణంలో తన పాత్ర లేదని.. తాను మద్యం తాగలేదు, అమ్మలేదని చెప్పుకొచ్చారు. తనని అన్యాయంగా అరెస్టు చేశారన్నారు. కేసులో ఇరికించిన వారిని వదిలేది లేదని హెచ్చరించారు. 'పైన దేవుడు ఉన్నాడు.. అన్నీ చూస్తుంటాడు' అంటూ పోలీసు జీపు ఎక్కి వెళ్లిపోయారు. కాగా, ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుల రిమాండ్ ముగిసింది. రిమాండ్ ముగియడంతో ఇవాళ (శుక్రవారం) నిందితులను విజయవాడ ఏసీబీ కోర్టుకు తీసుకువచ్చారు సిట్ అధికారులు.
ఈ వార్తలు కూడా చదవండి
పవన్ కల్యాణ్‌పై వ్యాఖ్యలు.. వైసీపీ కార్యకర్తను అదుపులోకి తీసుకున్న పోలీసులు
భవిష్యత్తులో సుపరిపాలన అందిస్తూ పెట్టుబడులు తీసుకొస్తాం: పల్లా శ్రీనివాసరావు