AP Government: గుడ్‌న్యూస్.. ఏపీకి మరో భారీ పరిశ్రమ.. ప్రభుత్వం అనుమతులు జారీ
ABN , Publish Date - Jul 27 , 2025 | 04:17 PM
కడప జిల్లా సున్నపురాళ్ల పల్లెలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ఫ్లాంట్ ఏర్పాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు జేఎస్‌డబ్ల్యూఏపీ స్టీల్ లిమిటెడ్ ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
అమరావతి: కడప జిల్లా సున్నపురాళ్ల పల్లెలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ఫ్లాంట్ ( Steel Plant) ఏర్పాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) చర్యలు తీసుకుంది. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు జేఎస్‌డబ్ల్యూ ఏపీ స్టీల్ లిమిటెడ్ ప్రతిపాదనలకు ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రూ.4,500 కోట్ల పెట్టుబడితో మొదటిదశ, రూ.16350 కోట్లతో రెండో దశ పనులు చేపట్టే ప్రతిపాదనలకు ఏపీ ప్రభుత్వం ఆమోదించింది. జేఎస్‌డబ్ల్యూ రాయలసీమ స్టీల్ ప్లాంట్ లిమిటెడ్‌కు ప్రోత్సాహాకాలిస్తూ, ప్యాకేజీని విస్తరిస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. విద్యుత్, నీటి కేటాయింపులు, మౌలిక సదుపాయాల కల్పన చర్యలకి ఆమోదించింది. సున్నపురాళ్ల పల్లె పరిధిలో ఎకరా రూ. 5 లక్షల చొప్పున 1100 ఎకరాల భూములని కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేసింది. జనవరి 2026 నాటికి స్టీల్‌ప్లాంట్ తొలిదశ పనులు ప్రారంభించాలని నిర్దేశించింది ఏపీ ప్రభుత్వం. ఏప్రిల్ 2029 నాటికి స్టీల్‌ప్లాంట్ తొలిదశ పనులు పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభించాలని దిశానిర్దేశం చేసింది.
జనవరి 2031 నాటికి స్టీల్ ప్లాంట్ రెండో దశ పనులు ప్రారంభిస్తామని ప్రతిపాదనల్లో తెలిపింది జేఎస్‌డబ్ల్యూ ఏపీ స్టీల్ లిమిటెడ్ సంస్థ. ఏప్రిల్ 2034 నాటికి స్టీల్ ప్లాంట్ రెండో దశ పనులు పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభిస్తామని జేఎస్‌డబ్ల్యూ సంస్థ ప్రతిపాదించింది. ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ఇచ్చిన ప్రతిపాదలనలను ఆమోదిస్తూ ఆదేశాలిచ్చింది ఏపీ ప్రభుత్వం. స్టీల్ ప్లాంట్ ఏర్పాటు సంస్థకు ఇండస్ట్రీయల్ డెవలప్‌మెంట్ పాలసీ ప్రకారం ప్రోత్సాహకాలు ఇవ్వాలని తగిన చర్యలు తీసుకోవాలని విద్యుత్, జలవనరులు, పరిశ్రమలు, రెవెన్యూ, ఆర్ధిక శాఖ అధికారులని ప్రభుత్వం ఆదేశించింది. ఏపీఐఐసీ వీసీ అండ్ చైర్మన్, పరిశ్రమల శాఖ డైరెక్టర్‌కు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పరిశ్రమలు వాణిజ్య శాఖ కార్యదర్శి వై.యువరాజ్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఏపీలో పెట్టుబడులకు సింగపూర్ గ్రీన్ సిగ్నల్.. ప్రధానంగా ఈ రంగాల్లో
బద్వేల్‌లో ఉప ఎన్నిక.. ఆదినారాయణరెడ్డి ఏమన్నారంటే..
Read latest AP News And Telugu News