AP Government: యూరియాపై ఏపీ ప్రభుత్వం అలర్ట్.. సీఎస్ కీలక ఆదేశాలు
ABN , Publish Date - Aug 22 , 2025 | 09:53 PM
యూరియా కొరత రానివ్వకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గత ఖరీఫ్ కంటే ఎక్కువగా ఎరువుల సరఫరా చేసేలా చర్యలు తీసుకుంది.
అమరావతి, ఆగస్టు22, (ఆంధ్రజ్యోతి): యూరియా (Urea) కొరత రానివ్వకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Government) చర్యలు చేపట్టింది. గత ఖరీఫ్ కంటే ఎక్కువగా ఎరువుల సరఫరా చేసేలా చర్యలు తీసుకుంది. 2025 ఖరీఫ్‌లో అదనంగా అందుబాటులో 83 వేల టన్నుల యూరియా ఉంది. విజిలెన్స్ అధికారులు నిఘా ఉంచి జిల్లాల వారీగా మానిటరింగ్ చేస్తున్నారు. యూరియా కొరతపై రైతులు ఆందోళన చెందవద్దని వ్యవసాయ శాఖ భరోసా ఇచ్చింది. ఎరువులు బ్లాక్ మార్కెట్‌కు తరలకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్లకు ఏపీ సీఎస్ ఆదేశాలు జారీ చేశారు.
యూరియా కొరత లేదు: కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్
మరోవైపు.. కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ మీడియాతో మాట్లాడారు. కడప జిల్లాలో రైతులకు యూరియా కొరత ఎక్కడ లేదని క్లారిటీ ఇచ్చారు. యూరియా కోసం రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. జిల్లాలో వర్షాలు ముందుగా రావడంతో వరి నాట్లు త్వరగా వేస్తున్నారని చెప్పుకొచ్చారు. జిల్లాలో ఎరువుల సమాచారం కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని వెల్లడించారు కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్.
వారిపై క్రిమినల్ చర్యలు..
ఎక్కడైనా ఎరువులు అయిపోతే వేరే కేంద్రాల నుంచి 24గంటల్లో అందజేస్తామని పేర్కొన్నారు. 3700 యూరియా జిల్లాలో అందుబాటులో ఉందని తెలిపారు. రైతులు తమకు సరిపడా ఎరువులు మాత్రమే తీసుకోవలసిందిగా సూచించారు. జిల్లాలో యూరియాను స్టాక్ పెట్టిన ఇతర అవసరాలకు వాడిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని మందలించారు. కొన్ని ప్రైవేట్ షాపుల్లో వేరే ఎరువులు తీసుకుంటేనే యూరియా ఇస్తామని చెబుతున్నారని.. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రేపటి(శనివారం) నుంచి జిల్లాలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తారని వెల్లడించారు. యూరియాను ఎమ్మార్పీ కంటే అధిక ధరలో విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. కడప జిల్లాలో ఎరువుల షాప్ వద్ద ప్రభుత్వ సిబ్బందిని నియమిస్తామని కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబు భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ
హిందూ ధర్మంపై విషం చిమ్ముతున్నారు.. జగన్ అండ్ కోపై మంత్రి ఆనం ధ్వజం
Read Latest AP News And Telugu News