Share News

Pawan Kalyan: అనతికాలంలోనే తిరుగులేని శక్తిగా..జనసేన ప్రస్థానం ఇదే..

ABN , Publish Date - Mar 14 , 2025 | 09:47 AM

Pawan Kalyan: అనతికాలంలోనే జనసేన పార్టీని తిరుగులేని శక్తిగా ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మలిచారు. ఏపీ రాజకీయాల్లో పవన్ పెను మార్పులు తీసుకు వచ్చారు. తాను నమ్ముకున్న చాణిక్య నీతి ప్రకారం నడుస్తూ ఓ రికార్డు క్రియేట్ చేశారు.

 Pawan Kalyan: అనతికాలంలోనే తిరుగులేని శక్తిగా..జనసేన ప్రస్థానం ఇదే..
Pawan Kalyan

అమరావతి: రాజకీయాల్లో ఆయనది ఒక చరిత్ర. ఎన్నో అటుపోట్లు తిని పైకి ఎదిగారు. ఎన్నో దెబ్బలు తిన్న తర్వాత తనను తాను ఓ శక్తిగా మలచుకున్నారు. వైసీపీ నేతలు ఎంతగానో విమర్శించినా తాను నమ్ముకున్న సిద్ధాంతం ప్రకారం ముందుకు కదిలారు. ఆయన మరెవరో కాదు కొణిదెల పవన్ కల్యాణ్. ఎంతోమంది తనను రాజకీయాలు వదిలేయమని అన్నారు. కానీ అతను మాత్రం ముందుకు కదిలారే కాని వెనక్కు తగ్గలేదు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు లాగా మొక్కవోని ధైర్యంతో ముందుకు కదిలారు. అలా 2014 మార్చి 14వ తేదీన జనసేన పార్టీని సినీనటుడు పవన్ కల్యాణ్ ప్రకటించారు. హైదరాబాద్ నగరం మాదాపూర్ ప్రాంతంలోని హైటెక్ సిటీ సమీపంలో ఓ హోటల్‌లో పవన్ కల్యాణ్ ఆవిర్భావ సభ నిర్వహించారు. ఓటు హక్కు లేని వారిని పవన్ నమ్ముకున్నారని పలువురు వైసీపీ నేతలు విమర్శించారు. వారినే ముందు ఉంచి జనసేన పార్టీని తిరుగులేని శక్తిగా పవన్ కల్యాణ్ ముందుకు నడిపించారు. 2014 నుంచి 2025 వరకు ఎన్నో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా పవన్ కల్యాణ్ నిలిచారు. దాదాపు పన్నెండెళ్ల ప్రస్థానంలో ఎంతోమంది పవన్ కల్యాణ్‌ను విమర్శించారు. ఇప్పుడు వారందరితో శెభాష్ పవన్ కల్యాణ్ అనిపించుకుంటున్నారు.


వెనక్కు తగ్గని పవన్..

2019లో భీమవరం, గాజువాక రెండు చోట్లా పోటీ చేసి ఓడిపోయారు. కానీ పవన్ మాత్రం వెనక్కు తగ్గలేదు. తాను నమ్ముకున్న చాణిక్య నీతిని నమ్ముకున్నాడు. తన ఓటమికి గల కారణాలపై పవన్ కల్యాణ్ విశ్లేషించుకున్నాడు. 2019లో జరిగిన తప్పిదాలను 2024 ఎన్నికల్లో చేయరాదని డిసైడ్ అయ్యారు. అనుకున్నట్లుగానే ఎన్టీఏ కూటమితో పొత్తు పెట్టుకున్నారు. సింపతి, అవినీతి రాజకీయాలు చేసే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందు పవన్ నమ్ముకున్న నీతి రాజకీయాలు పనిచేయలేదు. ఆ తర్వాత జగన్‌ను ఎదుర్కోవడానికి వారాహి యాత్రకు నడుం బిగించారు. వారాహి యాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. జనం గుండెల్లో తిరుగులేని శక్తిగా ఎదిగారు. ప్రజల్లో జనసేనకు వస్తున్న స్పందనను చూసి జగన్‌కు పవన్ కల్యాణ్ చెక్ పెట్టడం ప్రారంభించారు. టీడీపీ అధినేత చంద్రబాబును జగన్ ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని మొదటగా పవన్ కల్యాణ్ ఖండించారు. రాజమండ్రి జైల్లో ఉన్న చంద్రబాబును పరామర్శిస్తానని పవన్ కల్యాణ్ ప్రకటించారు.హైదరాబాద్ నుంచి వెంటనే రాజమండ్రి జైలుకు బయల్దేరారు. పవన్‌ పర్యాటనను అడ్డుకుంటామని వైసీపీ నేతలు హెచ్చరించారు.


పొత్తులో పవన్ కీలక పాత్ర..

పోలీసులు పవన్‌ను అడ్డుకోవడంతో రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు. అక్కడి నుంచి పవన్ రాజమండ్రికి వెళ్లి చంద్రబాబును పరామర్శించారు. ఆ తర్వాత టీడీపీతో పొత్తు పెట్టుకుంటునట్లు ప్రకటించారు. బీజేపీని కూడా పొత్తులో భాగస్వామ్యం చేయడంలో పవన్ కీలక పాత్ర పోషించారు. అక్కడ నుంచి ఏపీలో రాజకీయాలు అనూహ్య మలుపు తిరిగాయి. పవన్ కల్యాణ్ పాల్గొన్న ప్రతి బహిరంగ సభలోనూ జగన్‌కు గుణపాఠం చెబుతామని పవన్ హెచ్చరికలు చేశారు. ‘హలో ఏపీ.. బైబై జగన్’ అనే నినాదాలతో పవన్ కల్యాణ్ ముందుకు కదిలారు. ఇలా 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్టీఏ కూటమి తిరుగులేని బావుటా ఎగురవేసింది. ఇలా ఏపీ రాజకీయాల్లో పవన్ కల్యాణ్ పెనుమార్పులు తీసుకు వచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి

Pawan Kalyan: జనసేన పవర్ ముందు జగన్ డీలా.. నాడు అలా.. నేడు ఇలా

ABN Effect: వీఆర్‌‌కు సీఐ భుజంగరావు

For More AP News and Telugu News

Updated Date - Mar 14 , 2025 | 10:31 AM