ABN Effect: వీఆర్‌కు సీఐ భుజంగరావు
ABN , Publish Date - Mar 14 , 2025 | 08:23 AM
నెల్లూరు జీఆర్పీ సీఐ భుజంగరావుపై అవినీతి ఆరోపణలు నిర్ణారణ కావడంతో పోలీస్ ఉన్నతాధికారులు అతనిని వీఆర్‌కు పంపుతూ ఆదేశాలు జారీ చేశారు. సీఐ అక్రమాలపై గతంలో ఆధారాలతో సహా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కథనం ప్రసారం చేసింది. ఏబీఎన్ కథనంపై స్పందించిన ఉన్నతాధికారులు.. విచారణ చేపట్టారు.

నెల్లూరు: జీఆర్పీ (GRP) సీఐ భుజంగరావు (CI Bhujangarao)ని వీఆర్ (VR)కు పంపుతూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. అతనిపై త్వరలో శాఖాపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. సీఐ భుజంగరావు అక్రమాలపై గతంలో ఆధారాలతో సహా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కథనం (ABN Andhra Jyothi Story) ప్రసారం చేసింది. ఏబీఎన్ కథనంపై స్పందించిన ఉన్నతాధికారులు.. విచారణ చేపట్టారు. ఏబీఎన్ కథనంలో అంశాలన్నీ వాస్తవమని తేలడంతో సీఐ భుజంగరావుపై ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. నెల్లూరు జిల్లా, పడుగుపాడులో హత్యని ఆత్మహత్యగా చిత్రీకరించిన సీఐ భుజంగరావు... సిబ్బందిని తీవ్రస్థాయిలో వేధింపులకు గురిచేసి.. పెద్ద మొత్తాల్లో డబ్బులు వసూళ్లు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
Also Read..:
ఏబీఎన్ చేతిలో కీలక ఆధారాలు..
కాగా నెల్లూరు జీఆర్పీ సీఐ భుజంగరావు భారీ అవినీతి, అక్రమాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చేతికి కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. సిబ్బంది, అధికారుల ఫిర్యాదు మేరకు జిల్లా ఎస్పీ రాహుల్ మీనా విచారణ చేపట్టారు. విధులు సక్రమంగా నిర్వర్తించేలా చూడటం వల్లే తనపై ఆరోపణలు చేస్తున్నారంటూ సీఐ భుజంగరావు సమర్ధించుకున్నాడు.
భారీ అవినీతిపై విచారణ..
నెల్లూరు జీఆర్పీ సీఐ భుజంగరావు (GRP CI Bhujangarao) భారీ అవినీతి (Corruption), అక్రమాలపై ముమ్మర విచారణ జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Deputy CM Pawan Kalyan), ఉన్నాతాధికారులకు సిబ్బంది, అధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో జీఆర్పీ ఎస్పీ రాహుల్ మీనా (SP Rahul Meena) నేరుగా రంగంలోకి దిగారు. భుజంగరావు అవినీతి, అక్రమాలకు సంబంధించిన కీలక ఆధారాలు ఏబీఎన్ (ABN) చేతికి చిక్కాయి. కావలిలో దొంగగా మారిన మాజీ కానిస్టేబుల్‌తో సీఐ భుజంగరావు చీకటి ఒప్పందాలు చేసుకున్నారు. బ్యాంకు తాకట్టులో బంగారం తీసుకెళ్లేంత వరకు మౌనం... ఆపై బ్యాంకు మేనేజర్‌కు సీఐ నోటీసులు ఇచ్చేవారు.
రూ.10 లక్షలు వసూలు..
సూళ్లూరుపేటలో ప్రమాదవశాత్తు కార్మికుడు మృతి చెందగా, సీఐ భుజంగరావు కాంట్రాక్టర్ నుంచి రూ.10 లక్షలు వసూలు చేశారు. అలాగే గూడూరులో పట్టుబడ్డ 12 కిలోల గంజాయిని, స్థానిక గంజాయి వ్యాపారికి అమ్మి.. ఆపై ఆ వ్యాపారి నుంచి నెలవారీ మామూళ్లు తీసుకునేవారు... గూడూరులో నలుగురు ట్రాన్స్ జెండర్ల నుంచి ప్రతి నెలా రూ. 40 వేలు వసూలు చేసేవారు. ఉపయోగంలో లేని వాహానాల పేరుతో ఆయిల్ బిల్లులు స్వాహా.. ఇలా ఒకటేమిటి భుజంగరావుపై చాలా అవినీతి ఆరోపణలు ఉన్నాయి.
సిబ్బందిపై లైంగిక వేధింపులు..
పడుగుపాడు ప్రాంతంలో వ్యక్తి హత్య ఘటనని ఆత్మహత్యగా చిత్రీకరించి.. ఆత్మహత్యగా కేసు నమోదు చేయాలని మహిళా ఎస్ఐ, సిబ్బందిపై సీఐ భుజంగరావు బెదిరింపులకు దిగాడు. మహిళా అధికారులు, సిబ్బందిపై లైంగిక వేధింపులకు పాల్పడేవాడు. దిగువస్థాయి అధికారులు, సిబ్బందికి పెద్ద సంఖ్యలో మెమోలు ఇచ్చి అవి రూపుమాపడానికి నగదు వసూళ్లు చేసేవాడు. మృతదేహాల తరలింపులో కూడా అవినీతికి పాల్పడ్డాడు. ఒక్కో మృతదేహానికి రూ.5 వేలు చొప్పున ప్రభుత్వం ఇచ్చే నిధులూ స్వాహా చేసేవాడు. ఆత్మహత్య ఘటనలను ప్రమాదాలు, రైళ్లలో నుంచి జారిపడ్డట్టు చిత్రీకరించి భారీ మొత్తాల్లో డబ్బులు తీసుకునేవాడు. బిల్లులు లేకుండా బంగారం, వెండిని రైళ్లలో రవాణా చేసే వ్యాపారులకు సీఐ మద్దతిచ్చేవాడు. దిగువస్థాయి అధికారులు పట్టుకున్నా.. వారిని వదిలేయాలని పలుమార్లు ఆదేశాలు జారీ చేసేవాడు.జీఆర్పీ ఉన్నతాధికారి ఒకరు తన సమీప బంధువంటూ హంగామా చేశాడు. దీనికి సంబంధింది ఏబీఎన్‌కు వివరణ ఇచ్చేందుకు సిఐ భుజంగరావు నిరాకరించాడు. విధులు సక్రమంగా నిర్వర్తించేలా చూడటం వల్లే తనపై ఆరోపణలు చేస్తున్నారంటూ సీఐ భుజంగరావు సమర్ధించుకున్నాడు.
ఈ వార్తలు కూడా చదవండి..
గ్రూప్-3 ర్యాంకింగ్ జాబితా ఎప్పుడంటే..
ఏడు సెకన్లలోనే గుండె గుట్టు..!
For More AP News and Telugu News