Group-3: గ్రూప్-3 ర్యాంకింగ్ జాబితా ఎప్పుడంటే..
ABN , Publish Date - Mar 14 , 2025 | 07:17 AM
తెలంగాణ గ్రూప్ 3 ఫలితాలు శుక్రవారం విడుదల కానున్నాయి. జనరల్ ర్యాంకింగ్ లిస్టును టీజీపీఎస్సీ విడుదల చేయనుంది. తెలంగాణ రాష్ట్రంలో 1,365 గ్రూప్-3 సర్వీసుల పోస్టుల భర్తీకి నిర్వహించిన రాతపరీక్షల ఫలితాలను విడుదల చేస్తోంది. ఇప్పటికే షెడ్యూలు ప్రకారం ఈ నెల 10, 11 తేదీల్లో గ్రూప్ 1 ఫలితాలు, గ్రూప్-2 ఫలితాలు విడుదల చేసిన విషయం తెలిసిందే.

హైదరాబాద్: తెలంగాణ (Telangana) రాష్ట్రంలో గ్రూప్స్ పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. గ్రూప్-3 ఫలితాలు (Group-3 Results) శుక్రవారం విడుదలకానున్నాయి. జనరల్ ర్యాంకింగ్ లిస్టు(GRL)ను టీజీపీఎస్సీ (TGPSC) విడుదల చేయనుంది. గత ఏడాది నవంబర్ 17, 18న నిర్వహించిన గ్రూప్ -3 పరీక్షలకు 5,36,400 మంది దరఖాస్తు చేయగా, 2,69,483(50.24శాతం) మంది మాత్రమే హాజరయ్యారు. రాష్ట్రంలో 1,365 గ్రూప్-3 సర్వీసుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం పరీక్షలు నిర్వహించింది.ఇప్పటికే షెడ్యూలు ప్రకారం ఈ నెల 10, 11 తేదీల్లో గ్రూప్-1, గ్రూప్-2 రాతపరీక్షల మార్కులను కమిషన్ వెల్లడించిన విషయం తెలిసిందే. ఈరోజుగ్రూప్-3 జనరల్ ర్యాంకు జాబితా వెల్లడికానుంది. టీజీపీఎస్సీ వెబ్‌సైట్లో చూసుకోవచ్చు.
Also Read..:
కాగా గ్రూప్-1 ఫలితాలు సోమవారం (10వ తేదీ) విడుదల అయ్యాయి. 563 గ్రూప్-1 సర్వీసుల పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రధాన పరీక్షల్లో అభ్యర్థుల ప్రాథమిక మార్కుల (Preliminary Marks) వివరాలు టీజీపీఎస్సీ (TGPSC) వెల్లడించింది. గ్రూప్-1 ప్రధాన పరీక్షలకు 21,093 మంది హాజరయ్యారు. అలాగే మంగళవారం (11వ తేదీ) గ్రూప్ 2 (Group-2) పరీక్షల జనరల్ ర్యాంకింగ్స్ (General Rankings) వెలువడ్డాయి. రాష్ట్రంలో 783 గ్రూప్-2 పోస్టుల భర్తీకి గతేడాది డిసెంబరు 15, 16 తేదీల్లో నిర్వహించిన రాతపరీక్షల మార్కులను టీజీపీఎస్‌సీ (TGPSC) విడుదల చేసింది. అభ్యర్థులకు మార్కులతో కూడిన జనరల్ ర్యాంకు జాబితాను ప్రకటించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏడు సెకన్లలోనే గుండె గుట్టు..!
For More AP News and Telugu News