Tirumala Parakamani: TTD పరకామణి కేసు.. హైకోర్టు కీలక ఉత్తర్వులు
ABN , Publish Date - Oct 27 , 2025 | 12:59 PM
తిరుమల పరకామణిలో చోరీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును లోక్ అదాలత్ లో రాజీ చేసుకోవడంపై హైకోర్టు ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
తిరుపతి, అక్టోబర్ 27: తిరుమల పరకామణిలో చోరీకి సంబంధించిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును లోక్ అదాలత్ లో రాజీ చేసుకోవడంపై ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మొత్తం వ్యవహారం పై దర్యాప్తు చేయాలని సీఐడీని ఆదేశించింది. డైరెక్టర్ జనరల్ స్థాయికి తగ్గని అధికారిని ఐవోగా నియమించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. పరకామణి కేసు రాజీ వ్యవహారంలో టీటీడీ బోర్డు, అధికారుల పాత్ర పై కూడా దర్యాప్తు చేయాలని ధర్మాసనం ఆదేశించింది.
పరకామణిలో చోరీకి పాల్పడిన రవికుమార్ ఆస్తుల పై దర్యాప్తు చేయాలని డైరెక్టర్ జనరల్ ఏసీబీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రవికుమార్, కుటుంబ సభ్యుల స్థిర,చర ఆస్తులతో పాటు బ్యాంక్ ఖాతాలను పరిశీలించాలని స్పష్టం చేసింది. వారికి సంబంధించిన ఆస్తులను రిజిస్ట్రేషన్ ద్వారా వేరే వారికి ఏమైనా బదలాయించారా? అనే విషయం పై కూడా దర్యాప్తు చేపట్టి.. నివేదికను తదుపరి విచారణలోగా కోర్టు ముందు ఉంచాలని ఏసీబీ, సీఐడీకి హైకోర్టు ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణ డిసెంబర్ 2కి వాయిదా వేసింది.
ఇవి కూడా చదవండి
బస్సు దగ్ధం ఘటన.. డెడ్‌బాడీస్ అప్పగింత పూర్తి
ముళ్లకంపలోకి దూసుకెళ్లిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.. ఎక్కడంటే
Read latest AP News And Telugu News