Share News

Shreyas Iyer: అంతర్గత బ్లీడింగ్.. శ్రేయస్ అయ్యర్‌కు ఐసీయూలో చికిత్స

ABN , Publish Date - Oct 27 , 2025 | 12:55 PM

ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో గాయపడ్డ శ్రేయస్ అయ్యర్‌ను ప్రస్తుతం ఐసీయూలో ఉంచి చికిత్సను అందిస్తున్నారు. అంతర్గతంగా రక్తస్రావం అవుతున్నట్టు గుర్తించిన వైద్యులు అతడిని ఐసీయూకు తరలించారు. ప్రస్తుతం పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు.

Shreyas Iyer: అంతర్గత బ్లీడింగ్.. శ్రేయస్ అయ్యర్‌కు ఐసీయూలో చికిత్స
Shreyas Iyer In ICU

ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియాతో మూడో వన్డే సందర్భంగా గాయపడ్డ శ్రేయస్ అయ్యర్‌కు ప్రస్తుతం ఐసీయూలో చికిత్సను అందిస్తున్నారు. మ్యాచ్‌లో క్యాచ్‌ను పట్టే సమయంలో కిందపడినప్పుడు అతడి పక్కటెముకలకు గాయమైన విషయం తెలిసిందే. తొలుత డ్రెస్సింగ్ రూమ్‌లో ప్రాథమిక చికిత్స అనంతరం శ్రేయస్‌ను బీసీసీఐ సిబ్బంది వెంటనే సిడ్నీలో ఓ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో అంతర్గతంగా బ్లీడింగ్ అవుతున్నట్టు తాజాగా గుర్తించిన వైద్యులు శ్రేయస్‌ను ఐసీయూలోకి మార్చారు (Shreyas Iyer in ICU).

మరికొన్ని రోజుల పాటు అతడిని ఐసీయూలోనే పెట్టి చికిత్స అందించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. బ్లీడింగ్ కారణంగా ఇన్ఫెక్షన్ పెరగకుండా వైద్యులు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు చెప్పాయి. క్యారీ కొట్టిన బంతిని క్యాచ్ పట్టే క్రమంలో శ్రేయస్ వెనక్కి పరిగెడుతూ నేలను బలంగా తాకాడు. ఈ క్రమంలో అతడి పక్కటెముకలకు గాయమైంది. డ్రెసింగ్‌ రూమ్‌లో బీసీసీఐ వైద్య సిబ్బంది అతడి పరిస్థితిని గమనించాక వెంటనే ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉంది (BCCI health update on Iyer).


శ్రేయస్ మూడు వారాల్లో కోలుకుంటాడని తొలుత భావించారు. అయితే, అంతర్గతంగా రక్తస్రావం అవుతున్న నేపథ్యంలో అతడు పూర్తిగా కోలుకునేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. మరో వారం పాటు శ్రేయస్ ఆసుపత్రిలోనే ఉండే అవకాశం ఉంది. తరువాత ఆరోగ్య పరిస్థితిని బట్టి వైద్యులు శ్రేయస్‌ను ఇండియాకు పంపించే విషయంపై ఓ నిర్ణయం తీసుకుంటారు.


ఇవి కూడా చదవండి

2027 వరల్డ్ కప్.. రో-కో జోడీ ఫిక్స్: గావస్కర్

సెలెక్టర్లపై అసంతృప్తి వ్యక్తం చేసిన రహానే!

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 27 , 2025 | 01:13 PM