Varla Ramaiah ON YS Jagan: జగన్ పాలనలో శ్రీవారి సొమ్ము దోచుకున్నారు.. వర్ల రామయ్య ఫైర్
ABN , Publish Date - Sep 23 , 2025 | 07:20 PM
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ఐదేళ్ల అరాచక పాలనలో గత టీటీడీ పెద్దలు గద్దల్లా స్వామి వారి సొమ్మును దోచుకున్నారని.. దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నారని వర్ల రామయ్య ధ్వజమెత్తారు.
అమరావతి, సెప్టెంబరు23 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య (Varla Ramaiah) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ఐదేళ్ల అరాచక పాలనలో గత టీటీడీ పెద్దలు గద్దల్లా స్వామి వారి సొమ్మును దోచుకున్నారని.. దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నారని ధ్వజమెత్తారు. ఇవాళ(మంగళవారం) అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో వర్ల రామయ్య మీడియాతో మాట్లాడారు.పెద్ద జీఎం మఠానికి చెందిన రవికుమార్ అనే వ్యక్తి స్వామి వారి పరకామణి లెక్కింపులో పాల్గొని గత 15 ఏళ్లుగా శ్రీవారి సొమ్మును దొంగలించారని ఆరోపించారు. రవి కుమార్‌పై ఏప్రియల్ 30న 2023న అప్పటి ఏవీఎస్‌వో పోలీసులకు ఫిర్యాదు చేస్తే పోలీసులు దానిని ఐపీసీ 381 కింద కేసు నమోదు చేశారని పేర్కొన్నారు వర్ల రామయ్య.
ఛార్జ్ షీట్ వేశారు..
రవికుమార్‌ను అరెస్ట్ చేసి పోలీసులు మే 30 తేదీన కోర్టులో ఛార్జ్ షీట్ వేశారని గుర్తుచేశారు. అప్పటికే రవికుమార్ చెన్నై, తిరుపతిలో తన పేరు మీద తన భార్య పేరు మీద ఉన్న రూ.14 కోట్లు విలువైన ప్లాట్లు టీటీడీకి తిరిగి రాశాడని... దాని విలువ సుమారుగా రూ.100 కోట్లు ఉంటుందని తెలిపారు. సెప్టెంబరు 23న ముద్దాయి రవి కుమార్‌తో లోక్ అదాలత్‌లో రాజీ పడటంతో కేసు కేట్టేశారని చెప్పుకొచ్చారు. సెక్షన్ 320 సీఆర్‌పీసీ ప్రకారం దొంగతనం కేసులో దొంగ, సొమ్ము యజమాని రాజీపడితే లోక్ అదాలత్ కేసు కొట్టేయొచ్చా అని నిలదీశారు. లోక్ అదాలత్‌కి వెళ్లే ముందు ఆనాటి టీటీడీ బోర్డు, రాజీ పడాలని బోర్డు తీర్మానం చేసిందా..? లేదా ఆనాటి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి వ్యక్తిగత నిర్ణయమా? అని ప్రశ్నల వర్షం కురిపించారు వర్ల రామయ్య.
లోక్ అదాలత్‌లో రాజీ చేస్తారా?
‘వందలాది కోట్ల రూపాయలు స్వామివారి సొమ్ము కొట్టేస్తే, లోక్ అదాలత్‌లో రాజీ చేస్తారా?. ఈ కేసును లోక్ అదాలత్‌లో పెట్టిన ఆనాటి పోలీసు అధికారుల తప్పు కూడా ఉంది. ఇంతటి ప్రాధాన్యత కలిగిన స్వామి వారి సొమ్ము దొంగతనం కేసు లోక్ అదాలత్‌లో స్వీకరించడం కూడా తప్పే. తప్పుడు దర్యాప్తు చేసినా ఆనాటి సీఐ జగన్ మోహన్, తిరుపతి ఎస్పీ, టీటీడీ విజిలెన్స్ అధికారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ కేసు పూర్వపరాలు పరిశీలించకుండా, కోట్లాది స్వామివారి భక్తుల మనోభావాలు పట్టించుకోకుండా లోక్ అదాలత్‌లో కేసు కొట్టేయడంపై హైకోర్టు దర్యాప్తు చేయాలని మనవి చేస్తున్నాం . రాజీ పడాలని గత టీటీడీ బోర్డు తీర్మానం చేస్తే తప్పు అంతా బోర్డుదే, వ్యక్తిగత హోదాలో భూమన కరుణాకర్ రెడ్డి రాజీపడితే తప్పు అంతా అతనిదే. ఈ కేసు దర్యాప్తులో విఫలమైన పోలీసు అధికారులపైన సమర్థుడైన నిజాయితీ పరుడైన సీనియర్ పోలీసు అధికారితో ముఖ్యమంత్రి చంద్రబాబు దర్యాప్తునకు ఆదేశించాలి’ అని వర్ల రామయ్య కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి
అది నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం: మంత్రి లోకేష్
మీ వాదనలో నిజం ఉంటే సభకు రా.. జగన్‌కు మంత్రి సవాల్
For More Andhra Pradesh News and Telugu News..