Share News

CM Chandrababu: సీఎం చంద్రబాబు ఆదేశాలతో పొగాకు కొనుగోళ్లలో పెరిగిన వేగం

ABN , Publish Date - May 26 , 2025 | 03:59 PM

పొగాకు కొనుగోళ్లపై సంబంధిత అధికారులు, ఆయా కంపెనీల ప్రతినిధులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. కొనుగోళ్లపై ప్రతి రెండు రోజులకు ఒకసారి తనకు నివేదించాలని అధికారులకు ఆదేశించారు సీఎం చంద్రబాబు.

CM Chandrababu: సీఎం చంద్రబాబు ఆదేశాలతో పొగాకు కొనుగోళ్లలో పెరిగిన వేగం
CM Chandrababu Naidu

అమరావతి: రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా పొగాకు కొనుగోలుకు (Tobacco Purchases) చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులు, పొగాకు కంపెనీ ప్రతినిధులను ఆంధప్రదేశ్ సీఎం నారా చంద్రబాబునాయుడు (CM Chandrababu Naidu) ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో పొగాకు కొనుగోళ్లలో వేగం పెరిగింది. పొగాకు రైతుల సమస్యలపై ఈ నెల(మే) 16వ తేదీన అధికారులు, పలు కంపెనీల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. సీఎం సమీక్ష అనంతరం కొనుగోళ్లు ఊపందుకున్నాయి.


హెచ్డీబర్లే పొగాకు 75 మిలియన్ కేజీల దిగుబడి రాగా.. ఇప్పటికే 21 మిలియన్ కేజీల కొనుగోళ్లు జరిగాయి. ఇంకా రైతుల వద్ద 54 మిలియన్ కిలోల నిల్వలు ఉన్నాయి. ఈ నిల్వల్లో 20 మిలియన్ కేజీలు కొనుగోలు చేస్తామని జీపీఐ, ఐటీసీ ప్రకటించింది. 30 మిలియన్ కేజీల వరకు పొగాకు కొనుగోలు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. రైతుల వద్దనున్న స్టాకు వివరాలను సంబంధిత గ్రామ వ్యవసాయ సహాయకులు సర్వే చేసి నమోదు చేయడానికి ప్రత్యేక మొబైల్ యాప్‌ను ప్రభుత్వం రూపొందించింది.


పొగాకు అమ్మకాలను సమీక్షించేందుకు కంట్రోల్ రూమ్‌ నెంబర్‌ను 0863-2358531 ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కొనుగోలుపై అన్ని పొగాకు కంపెనీలకు ముఖ్యమంత్రి లక్ష్యాన్ని నిర్దేశించారు. కొనుగోళ్లపై ప్రతి రెండు రోజులకు ఒకసారి తనకు నివేదించాలని అధికారులకు ఆదేశించారు. ఈ క్రమంలో క్షేత్రస్థాయిలోకి వెళ్లి కొనుగోళ్లను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. క్వింటాల్‌కు రూ.12 వేల ధర తగ్గకుండా వారం రోజుల్లో కొనుగోళ్లు పూర్తి చేయాలని అన్నారు. సీఎం ఆదేశాలు అమలయ్యేలా చూసేందుకు కొనుగోళ్లపై 14 పొగాకు కంపెనీల ప్రతినిధులతో ఇవాళ(సోమవారం) వ్యవసాయ శాఖ ప్రధాన కార్యదర్శి సమావేశం నిర్వహించారు.


ఈ వార్తలు కూడా చదవండి

పారపట్టి మట్టి పనులు చేసిన మంత్రి

మీకు వ్యక్తులు చనిపోవడమే కావాలా.. పేర్నిపై ఏపీ మంత్రి ఫైర్

Read Latest AP News And Telugu News

Updated Date - May 26 , 2025 | 04:25 PM