Share News

NITI Aayog:జగన్ పాలనపై నీతి ఆయోగ్ సంచలన రిపోర్టు

ABN , Publish Date - Jan 24 , 2025 | 08:19 PM

NITI Aayog: గత జగన్ పాలనపై నీతి ఆయోగ్ సంచలన రిపోర్టు విడుదల చేసింది. వైసీపీ పాలనలో ఏపీ ఆర్థికంగా చాలా వెనుకబడి ఉందని తెలిపింది. దీంతో పాటు ఆరోగ్య పరిస్థితులు అత్యంత దయానీయంగా ఉన్నాయని నీతి ఆయోగ్ పేర్కొంది.

NITI Aayog:జగన్ పాలనపై నీతి ఆయోగ్ సంచలన రిపోర్టు

ఢిల్లీ : గత జగన్ పాలనలో ఏపీ ఆర్థిక, ఆరోగ్యం అత్యంత దయనీయంగా ఉందని నీతి ఆయోగ్ వెల్లడించింది. 2022-23లో ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా వెనుకబడిందని, ఆరోగ్యం అత్యంత దయనీయంగా ఉందని నీతి ఆయోగ్ పేర్కొంది. ఈ మేరకు 2022-23 ఆర్థిక ఆరోగ్య డేటాను నీతి ఆయోగ్ విడుదల చేసింది. 2022-23 ఆర్థిక ఏడాదిలో 17వ స్థానంలో నిలిచినట్లు డేటాలో నీతి ఆయోగ్ పేర్కొంది. ఆ ఏడాది ఆర్థిక ఆరోగ్యంలో ఒడిశా అద్భుతంగా ఉందని, తర్వాత స్థానంలో ఛత్తీస్‌గఢ్ ఉండగా... 8వ స్థానంలో తెలంగాణ నిలిచిందని చెప్పింది.


ఆంధ్రప్రదేశ్ కంటే పంజాబ్ మినహా... మిగిలిన అన్ని రాష్ట్రాల ఆర్థిక, ఆరోగ్య స్థితి బావుందని నివేదికలో నీతి ఆయోగ్ పొందుపరిచింది. నాణ్యతతో కూడిన ఖర్చులు, రెవెన్యూ సమీకరణ, ఆర్థిక హేతుబద్ధత, అప్పుల జాబితా, అప్పులు తిరిగి చెల్లించగలిగే సామర్థ్యం వంటి అంశాలపై నీతి ఆయోగ్ కమిటీ అధ్యయనం చేసింది. నీతి ఆయోగ్ నివేదికను 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగడియా విడుదల చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

AP News: ఈ బడ్జెట్‌లో ఏపీకి ప్రాధాన్యత కల్పించండి: సీఎంచంద్రబాబు..

Visakha: కోడికత్తి కేసులో ఎన్ఐఏ కోర్టుకు శ్రీను.. మరి జగన్ వెళ్లారా..

Supreme Court: వైసీపీ నేత గౌతంరెడ్డికి సుప్రీంలో ఊరట

Read Latest AP News and Telugu News

Updated Date - Jan 24 , 2025 | 08:25 PM