Minister Lokesh On Education: షేక్ ఫిరోజ్ బాషా పిల్లల తలరాత మార్చారు.. మంత్రి లోకేష్ అభినందనలు
ABN , Publish Date - Nov 08 , 2025 | 09:57 PM
పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువు పాఠశాలలో విద్యా విప్లవం సృష్టిస్తున్న స్పెషల్ గ్రేడ్ టీచర్ షేక్ ఫిరోజ్ బాషాపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అభినందనల వర్షం కురిపించారు. పిడుగురాళ్ల తుమ్మలచెరువు పాఠశాల అభివృద్ధికి షేక్ ఫిరోజ్ బాషా విశేషంగా కృషి చేస్తున్నారని వ్యాఖ్యానించారు మంత్రి నారా లోకేష్.
అమరావతి,నవంబరు8 (ఆంధ్రజ్యోతి): పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువు పాఠశాలలో విద్యావిప్లవం సృష్టిస్తున్న స్పెషల్ గ్రేడ్ టీచర్ షేక్ ఫిరోజ్ బాషా (ShaikFirozBasha)పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) అభినందనల వర్షం కురిపించారు. పిడుగురాళ్ల తుమ్మలచెరువు పాఠశాల అభివృద్ధికి షేక్ ఫిరోజ్ బాషా విశేషంగా కృషి చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా మంత్రి నారా లోకేష్ ట్వీట్ పెట్టారు.
షేక్ ఫిరోజ్ భాషా ఆదర్శంగా నిలిచారు..
‘పిల్లల తలరాత మార్చే విద్యను అందిస్తూ, అందమైన అక్షరాలు పొందికగా రాయడం నేర్పిస్తూ, ఆదర్శంగా నిలుస్తున్న పిడుగురాళ్ల మండలం, తుమ్మలచెరువు మెయిన్ పాఠశాలలో స్పెషల్ గ్రేడ్ టీచర్‌గా పనిచేస్తున్న షేక్ ఫిరోజ్ బాషాకి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రతి రోజూ ఉదయం ముందుగా స్కూలుకు వెళ్లి, సాయంత్రం అదనపు సమయం స్కూల్లోనే ఉంటూ విద్యార్థులకు క్లాసులు తీసుకునే మీ కమిట్‌మెంట్‌కు హ్యాట్సాఫ్. మీరు పిల్లలకు నేర్పిన తెలుగు, ఇంగ్లీష్ హ్యాండ్ రైటింగ్ డిజిటల్ ప్రింటింగ్‌లా అందంగా ఉంది. పిల్లలకు వివిధ సబ్జెక్టుల్లో ఉన్న భయాలను పోగొట్టేందుకు, వారిలో ఒకరిగా కలిసిపోతూ ఆటపాటలతో విద్యాబోధన చేస్తున్న షేక్ ఫిరోజ్ బాషా ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. స్కూల్లో ప్రస్తుతం 200 మంది పిల్లలు చదువుతుండటం గొప్ప విషయం. ఇదే ప్రభుత్వ పాఠశాలల్లో నేను కోరుకుంటున్న మార్పు. భావి భారత పౌరులను తీర్చిదిద్దేందుకు తన శక్తి మేర కృషి చేస్తున్న షేక్ ఫిరోజ్ బాషాకి, సహకరిస్తున్న తోటి టీచర్లు, సిబ్బందికి ధన్యవాదాలు’ అని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలి.. ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు
జగన్ హయాంలో సహకార, వ్యవసాయ పరపతి సంఘాల్లో అవినీతికి పాల్పడ్డారు
Read Latest AP News And Telugu News