Share News

IAS Officers Transfers In Andhra Pradesh: భారీగా ఐఏఎస్‌లు బదిలీ..

ABN , Publish Date - Oct 09 , 2025 | 07:07 PM

ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో ఇద్దరు అల్ ఇండియా సర్వీస్ అధికారులు సైతం ఉన్నారు.

IAS Officers Transfers In Andhra Pradesh: భారీగా ఐఏఎస్‌లు బదిలీ..

అమరావతి, అక్టోబర్ 09: రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. మొత్తం 31 మంది అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా గురువారం ఆదేశాలు జారీ చేశారు. బదిలీ అయిన వారిలో వివిధ సంస్థల డైరెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, సబ్ కలెక్టర్లు ఉన్నారు.


  • వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ డైరెక్టర్: కేవీఎన్ చంద్రశేఖర్‌బాబు

  • వ్యవసాయశాఖ డైరెక్టర్‌: మనజీర్ జిలానీ సమూన్‌

  • ఏపీపీఎస్‌సీ సెక్రటరీ: పి.రవి శుభాష్

  • ఏపీఎస్‌పీడీసీఎస్ చైర్మన్ అండ్ ఎండీ: శివశంకర్ లోతేటి

  • ఏపీ పౌరసరఫరాల కార్పొరేషన్ వైస్ చైర్మన్, ఎండీ: ఎస్.ఢిల్లీరావు

  • ఇంటర్ విద్య డైరెక్టర్‌: పి.రంజిత్ బాషా

  • ఏపీ హౌసింగ్ బోర్డు కార్పొరేషన్ వైస్ చైర్మన్, ఎండీ: పి.అరుణ్‌బాబు

  • అడిషనల్ సీసీఎల్‌ఏ అండ్ సెక్రటరీ: జేవీ మురళి

  • అడిషనల్ సీసీఎల్‌ఏ అండ్ జాయింట్ సెక్రటరీగా టీఎస్ చేతన్

  • ఏపీ వేర్‌ హౌసింగ్ కార్పొరేషన్ వైస్ చైర్మన్, ఎండీ: బి.నవ్య

  • ఏపీ ఎయిర్ పోర్టు డెవలెప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండి: సి.వి.ప్రవీణ్ ఆదిత్య

  • ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్, ఎక్స్ అఫీషియో డిప్యూటీ సెక్రటరీ జనరల్ అడ్మినిష్ట్రేషన్: కె.ఎస్. విశ్వనాథ్


  • సివిల్ సప్లైస్ అండ్ ఎక్స్ అఫిషియో డిప్యూటీ సెక్రటరీ (వినియోగదారుల వ్యవహారాలు): ఆర్.గోవిందరావు

  • ఏపీ స్టేట్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ సెక్రటరీ: ఎస్.చిన్నరాముడు

  • ఏపీ ట్రాన్స్ కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌: జి.సూర్యసాయి ప్రవీణ్ చంద్

  • బాపట్ల జాయింట్ కలెక్టర్, అడిషనల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్: భావనా

  • సోషల్ వెల్ఫేర్ డిపార్టుమెంట్ ప్రభుత్వ డిప్యూటీ సెక్రటరీ: సి.విష్ణు చేతన్

  • వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డిప్యూటీ సెక్రటరీ: ఎస్ఎస్ సోబికా

  • ఏపీ మేరిటైమ్ బోర్డు, సీఈవో, ఏపీ మ్యారిటైమ్ బోర్డు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పూర్తి అదనపు బాధ్యతలు: అభిషేక్ కుమార్


  • కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్, అడిషనల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్: నూరూల్ కోమర్

  • రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌: రాహూల్ మీనా

  • కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్, అడిషనల్ డిస్ట్రిక్ట్ మెజిస్టేట్: అపూర్వ భరత్

  • శ్రీ సత్యసాయి జిల్లా జాయింట్ కలెక్టర్, అడిషనల్ డిస్ట్రిట్ మెజిస్ట్రేట్: మంత్రి మౌర్య భరద్వాజ్

  • హౌసింగ్ డిపార్టుమెంట్ డిప్యూటీ సెక్రటరీ: సహదిత్ వెంటక్ త్రివినాగ్

  • ఏపీ డైయిరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ, ఏపీ అమూల్ ప్రాజెక్ట్ స్పెషల్ ఆఫీసర్‌: మురళీధర్ కొమ్మిశెట్టి (ఐఆర్ఎస్ అధికారి)

  • ఏపీ లెథర్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ వీసీ ఎండీ: ప్రసన్న వెంకటేష్

  • యువజన సర్వీసులు ఎండీ, ఏపీ సొసైటీ ఫర్ ట్రైనింగ్ అండ్ ఎంప్లాయిమెంట్ ప్రమోషన్‌ కమిషనర్ భరణి (ఐఎఫ్ఎస్ అధికారి)

  • అల్లూరి సీతారామరాజు జిల్లా జాయింట్ కలెక్టర్, అడిషనల్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్: తిరుమణి శ్రీపూజిత


ఈ వార్తలు కూడా చదవండి..

అసెంబ్లీ ఎన్నికల వేళ.. తేజస్వీ కీలక ప్రకటన

రైతులకు గుడ్ న్యూస్.. నెలకు రూ.5000 పెన్షన్..

మరిన్ని ఏపీ వార్తలు, జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 09 , 2025 | 09:18 PM