Maoists Bandh: ఏజెన్సీ బంద్‌కు మావోయిస్టుల పిలుపు.. పోలీసుల అలర్ట్..
ABN , Publish Date - Nov 29 , 2025 | 09:47 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివారం మావోయిస్టులు బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ మేరకు మావోయిస్టు పార్టీ కీలక ప్రకటన విడుదల చేసింది. మావోయిస్టులు బంద్‌కు పిలుపు ఇవ్వడంతో ఏజెన్సీలో పోలీసులు అప్రమత్తం అయ్యారు.
అల్లూరి జిల్లా, నవంబరు29 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రానికి సంబంధించిన ఏజెన్సీ ప్రాంతాల్లో రేపు(ఆదివారం) మావోయిస్టులు బంద్‌కు (Maoists Bandh) పిలుపునిచ్చారు. ఈ మేరకు మావోయిస్టు పార్టీ కీలక ప్రకటన విడుదల చేసింది. మావోయిస్టులు బంద్‌కు పిలుపు ఇవ్వడంతో ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులు అప్రమత్తం అయ్యారు. భద్రాచలం, పాడేరు, గుత్తేడు, వై రామవరం, తదితర ప్రాంతాలకు ఈరోజు (శనివారం) రాత్రి నుంచే ఏపీఎస్ ఆర్టీసీ బస్సు సర్వీసులను నిలిపి వేసింది. ప్రజాప్రతినిధులు, ఉన్నతస్థాయి అధికారులు ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటించవద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.
కాగా, మావోయిస్టుల చర్యలను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మావోయిస్టుల చర్యలను కేంద్ర బలగాలు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నాయి. ఇటీవల ఏపీలోని మారేడుమిల్లిలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా మృతిచెందారు. హిడ్మాతో పాటు పలువురు మావోయిస్టు కీలక నేతలు ఎన్‌కౌంటర్ అయ్యారు. భద్రత బలగాల చర్యలను మావోయిస్టు పార్టీ తీవ్రంగా ఖండించింది. ఈ క్రమంలోనే ఆదివారం బంద్‌కు మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చినట్లు సమాచారం.
ఈ వార్తలు కూడా చదవండి..
టీటీడీ కల్తీ నెయ్యి కేసులో మరో కీలక పరిణామం
రేపు ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్.. జాగ్రత్త సుమీ!
Read Latest AP News And Telugu News