Share News

Jana Sena Criticism YSRCP: ఏం జరిగినా పవన్‌కు అంటగట్టే ప్రయత్నం: వైసీపీపై జనసేన నేత ఆగ్రహం

ABN , Publish Date - Oct 21 , 2025 | 01:19 PM

ఏం జరిగినా దానిని జనసేన పార్టీకి, అధినేత పవన్ కళ్యాణ్‌కు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని జనసేన నేత మండిపడ్డారు. ఒక సిద్ధాంతానికి కట్టుబడి పనిచేసే పార్టీ జనసేన అని స్పష్టం చేశారు.

Jana Sena Criticism YSRCP: ఏం జరిగినా పవన్‌కు అంటగట్టే ప్రయత్నం: వైసీపీపై జనసేన నేత ఆగ్రహం
Jana Sena Criticism YSRCP

గుంటూరు, అక్టోబర్ 21: నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గంలో తిరుమలశెట్టి లక్ష్మయ్యనాయుడు హత్య ఘటనను ఎవరైనా ఖండించాల్సిందే అని జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు (Janasena Leader Gade Venkateshwar Rao) అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ఆ ఘటనకు బాధ్యులైన వారిని ఎవరినీ వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి జనసేన పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఏం జరిగినా దానిని జనసేన పార్టీకి, అధినేత పవన్ కళ్యాణ్‌కు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఒక సిద్ధాంతానికి కట్టుబడి పనిచేసే పార్టీ జనసేన అని స్పష్టం చేశారు.


రాజకీయ లబ్ది కోసం కులాలకు అంటగట్టడం సరైన విధానం కాదన్నారు. పవన్ కళ్యాణ్ స్పందించిన ఎన్నో ఘటనల్లో బాధితులకు న్యాయం జరిగిందని గుర్తుచేశారు. చనిపోయిన వ్యక్తి గురించి తాము మాట్లాడటం లేదన్నారు. చంపిన వ్యక్తిని నిలువునా ఉరితీయాలనే నినాదంతో అక్కడికి వెళదామని.. వైసీపీ నాయకులు వస్తారా అని సవాల్ విసిరారు. పలకరింపులను కూడా వైసీపీ నాయకులు రాజకీయం చేస్తున్నారని గాదె వెంకటేశ్వరరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.


పవన్ కళ్యాణ్ జోలికి వస్తే..: ఎమ్మెల్యే బలరామకృష్ణ

కందుకూరులో జరిగిన హత్యను వైసీపీ రాజకీయం చేసి కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతోందని జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మండిపడ్డారు. హత్యను పవన్ కళ్యాణ్‌కు, జనసేనకు ఆపాదించటం సిగ్గుచేటన్నారు. కుటుంబంలో ఆర్థికపరమైన లావాదేవీల వల్ల హత్య జరిగినట్టు కుటుంబ సభ్యులే చెబుతున్నారని తెలిపారు. వైసీపీ పాలనలో నేతలు ఎవరినైనా పరామర్శించారా అని ప్రశ్నించారు. జగన్ తాడేపల్లి ప్యాలెస్ నుంచి ప్రజలను పరామర్శించిటానికి ఎప్పుడైనా బయటకు వచ్చారా అని నిలదీశారు. కాపు కార్పోరేషన్ చైర్మన్‌గా పనిచేసిన జక్కంపూడి రాజా, జలవనరుల శాఖ మంత్రిగా పనిచేసిన అంబటి రాంబాబులు కాపులను ఏమైనా ఉద్దరించారా అంటూ ఫైర్ అయ్యారు. కాపు వీరమహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జక్కంపూడి రాజా ఆత్మ విమర్శలు చేసుకోవాలన్నారు. దళిత డ్రైవర్‌ను హత్య చేసిన వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబును జక్కంపూడి కుటుంబం భుజాలుపై మోశారని మండిపడ్డారు. దళితుడ్ని హత్య చేసిన వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబుపై ఆ పార్టీ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ జోలికి వస్తే జనసేన నేతలు, వీరమహిళలు బుద్ది చెబుతారని హెచ్చరించారు. కాపు, కమ్మ సామాజిక వర్గాల మధ్య ఎక్కడా విబేధాలు లేవని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి..

విదేశీ పర్యటనకు సీఎం చంద్రబాబు.. మూడు దేశాల్లో..

పోలీసుల పని తీరును తప్పక కొనియాడాల్సిందే: విశాఖ సీపీ

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 21 , 2025 | 01:20 PM