Share News

AP GOVT:ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం

ABN , Publish Date - Feb 08 , 2025 | 07:52 AM

AP GOVT: ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రజల నుంచి విజ్ఞప్తులు పెద్దస్థాయిలో రావడంతో మహానాడు రోడ్డును యధాతధంగా ఉంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేసింది.

AP GOVT:ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం
AP GOVT

అమరావతి: మహానాడు రోడ్డు పేరును యధాతధంగా ఉంచాలంటూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో దేవినేని అవినాష్ ప్రోద్బలంతో మహానాడు రోడ్డు పేరును దేవినేని రాజశేఖర్ రెడ్డి పేరుగా మార్చారు. మహానాడు పేరు కొనసాగించాలంటూ స్థానికుల నుంచి పెద్దఎత్తులో విజ్ఞప్తులు ప్రభుత్వానికి వచ్చాయి. స్థానికుల విజ్ఞప్తితో పాటు రోడ్డు చరిత్రను వివరిస్తూ మున్సిపల్ కమిషనర్‌కు విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు లేఖ రాశారు. ఈ లేఖపై స్పందించి రికార్డును పరిశీలించి, సమగ్ర నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి మున్సిపల్ కమిషనర్ నివేదించారు. కౌన్సిల్ తీర్మానం వివాదాస్పదంగా ఉండటంతో ఆ తీర్మానాన్ని రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి:

MLC Nominations : ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి నాలుగు నామినేషన్లు

GV Reddy: ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి ఎందుకు పారిపోయారు

Read Latest AP News and Telugu News

Updated Date - Feb 08 , 2025 | 08:08 AM