Share News

AP News: రేపు విద్యా సంస్థలకు సెలవు..

ABN , Publish Date - Aug 13 , 2025 | 09:37 PM

ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా అధికార యంత్రాంగం అలర్ట్ అయ్యింది. ప్రజలు ఎవరు అవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించారు.

AP News: రేపు విద్యా సంస్థలకు సెలవు..

గుంటూరు: ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు ఎవరు అవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు. వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలన్ని జలమయం అయ్యాయి. రోడ్లు నదులను తలపిస్తున్నాయి. రాబోయే మూడు రోజులు ఏపీలోని పలు జిల్లాల్లో భారీనుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.


ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా అధికార యంత్రాంగం అలర్ట్ అయ్యింది. జిల్లాలో కురుస్తున్న అధిక వర్షాలు, వరదల దృష్ట్యా రేపు(ఆగష్టు 14) జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, అంగన్వాడి కేంద్రాలకు సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి వెల్లడించారు. ప్రజలు ఎవరు అవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించారు. అధికారులు పరిస్థితులపై ఎప్పటికప్పుడు అలర్ట్ ఉండాలని ఆమె ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్లాలని తెలిపారు.

Updated Date - Aug 13 , 2025 | 09:47 PM