Chandrababu Naidu: ఏపీలో మరిన్ని విమానాశ్రయాలు నిర్మించబోతున్నాం..
ABN , Publish Date - Sep 30 , 2025 | 07:02 PM
ఏపీలో మరిన్ని విమానాశ్రయాలు నిర్మించబోతున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఏపీని ఉత్తమమైన లాజిస్టిక్స్‌కు కేంద్రంగా చేయాలనేది లక్ష్యమని పేర్కొన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ ముందుందని చెప్పుకొచ్చారు.
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన బిజీబిజీగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో CII సదస్సుకు చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పరిశ్రమలను CII నిరంతరం ప్రమోట్ చేస్తోందని తెలిపారు. ఏపీలో ఏడోసారి CII సదస్సు నిర్వహించబోతున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే పలుమార్లు వివిధ దేశాల్లో పారిశ్రామికవేత్తలను కలిశామని గుర్తు చేశారు. వారితో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు. రాష్ట్రాలను ప్రమోట్ చేసుకునేందుకు CII శక్తివంతమైన వేదికని నొక్కిచెప్పారు. రాష్ట్రాల భాగస్వామ్యం లేకుండా భారత వృద్ధి సంపూర్ణం కాదని వివరించారు. రాష్ట్రాలు పెట్టుబడులను ఆకర్షించేందుకు సరైన వేదిక CII అని ఉద్ఘాటించారు.
ఏపీలో మరిన్ని విమానాశ్రయాలు నిర్మించబోతున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఏపీని ఉత్తమమైన లాజిస్టిక్స్‌కు కేంద్రంగా చేయాలనేది లక్ష్యమని పేర్కొన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ ముందుందని చెప్పుకొచ్చారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు మార్పు వచ్చిందని స్పష్టం చేశారు. పోటీ ప్రపంచంలో పెట్టుబడులను ఎప్పుడు ఆకర్షిస్తూ.. ఉండాలని సూచించారు. ఆదాయం సృష్టించడం ద్వారా ప్రజలకు ఉత్తమ సేవలు అందుతాయని ధీమా వ్యక్తం చేశారు. తద్వారా పేదరికాన్ని నిర్మూలించవచ్చని చంద్రబాబు స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
శబరిమల అయ్యప్ప స్వామి భక్తులకు శుభవార్త
ఢిల్లీలో భారీ వర్షం, ట్రాఫిక్ ఇబ్బందులు..విమాన సర్వీసులపై ప్రభావం