Jagan Mohan Reddy: వ్యక్తిగత విచారణకు హాజరుకావాలి.. జగన్‌కు సీబీఐ కోర్టు ఆదేశం..
ABN , Publish Date - Sep 25 , 2025 | 08:16 PM
చాలా ఏళ్ల తరువాత జగన్‌ను వ్యక్తిగతంగా విచారణకు రావాలని సీబీఐ కోర్టు ఆదేశించడం చర్చనీయాంశంగా మారింది. గతేడాది ఎన్నికల అనంతరం తన పిల్లల ఉన్నత చదువుల కోసం యూరప్ వెళ్లేందుకు అనుమతి కోరుతూ సీబీఐ కోర్టులో జగన్ పిటిషన్ దాఖలు చేశారు.
గుంటూరు: యూరప్ పర్యటనకు అనుమతి ఇవ్వాలని మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సీబీఐ కోర్టులో మరోసారి పిటిషన్ దాఖలు చేశారు. అక్టోబర్ నెలలో 1 నుంచి 30 తేదీలోపు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును కోరారు. అక్టోబర్ నెలలో 15 రోజుల్లో యూరప్ వెళ్లి రావాలని పేర్కొన్నారు. పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం జగన్ యూరప్ పర్యటనకు అనుమతి ఇచ్చింది.
అలాగే.. యూరప్ పర్యటన తరువాత సీబీఐ కోర్ట్ ముందు హాజరు కావాలని ఆదేశించింది. నవంబర్ 1 నుంచి 14 లోపు కచ్చితంగా వ్యక్తగతంగా సీబీఐ కోర్ట్ ముందు హాజరు కావాలని తేల్చి చెప్పింది. చాలా ఏళ్ల తరువాత జగన్‌ను వ్యక్తిగతంగా విచారణకు రావాలని సీబీఐ కోర్టు ఆదేశించడం చర్చనీయాంశంగా మారింది.
గతేడాది ఎన్నికల అనంతరం తన పిల్లల ఉన్నత చదువుల కోసం యూరప్ వెళ్లేందుకు అనుమతి కోరుతూ సీబీఐ కోర్టులో జగన్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే అప్పుడు కోర్టు అనుమతికి నిరాకరించడంతో పర్యటన వాయిదా పడింది. దీంతో జగన్ తాజాగా మరోసారి పిటిషన్ దాఖలు చేసుకున్నారు. ఈ మేరకు విచారణ చేపట్టిన సీబీఐ కోర్టు పర్యటనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Also Read:
ఎవరైనా ఆడబిడ్డల జోలికి వచ్చారో.. సీఎం డెడ్లీ వార్నింగ్
వైసీపీ హయాంలో చిరంజీవిని అవమానించారంటూ బాలయ్య ఫైర్..