AP Inter Supplementary Results: ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
ABN , Publish Date - Jun 07 , 2025 | 02:07 PM
ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలను శనివారం ఇంటర్ మీడియట్ బోర్డు ప్రకటించింది. మే 12వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఈ పరీక్షలు జరిగాయి.
అమరావతి: ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలను (AP Inter Supplementary Results) శనివారం(జూన్7) ఇంటర్ మీడియట్ బోర్డు విడుదల చేసింది. మే 12వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఈ పరీక్షలు జరిగాయి. విద్యార్థులు ఈ ఫలితాలను సంబంధిత వెబ్‌సైట్ https://resultsbie.ap.gov.in ద్వారా లేదా మనమిత్ర వాట్సాప్ ద్వారా 9552300009 పొందవచ్చని తెలిపింది. మొదటి సంవత్సరం అన్ని కేటగిరీలని కలిపి 2 లక్షల 35 వేల 962 మంది విద్యార్థులు పరీక్ష రాయగా వీరిలో.. లక్ష 91 వేల 743 మందికి మార్కులు పెరిగాయని ఇంటర్ మీడియట్ బోర్డు పేర్కొంది.
ఇంటర్ సప్లమెంటరీ పలితాల తర్వాత మొదటి సంవత్సరం విద్యార్థుల పాస్ పర్సెంటేజ్ 82.16 శాతం..
కాగా ద్వితీయ సంవత్సరం 93.35 శాతంగా నమోదైంది. రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్‌కి ఈ నెల 9వ తేదీ నుంచి 13వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది. రీ వెరిఫికేషన్ కోసం సబ్జెక్ట్‌కి రూ. 1300 ఫీజు నిర్ణయించగా.. రీ కౌంటింగ్ కోసం సబ్జెక్ట్‌కి రూ. 260లు ఫీజుగా ఇంటర్ మీడియట్ బోర్డు నిర్దారించింది.
ఈ వార్తలు కూడా చదవండి
తిరుమల లడ్డూ.. భక్తుల విశ్వాసానికి ప్రతీక
Read Latest AP News And Telugu News