AP Government: ఏపీ సీఎస్ విజయానంద్ సర్వీసు పొడిగింపు
ABN , Publish Date - Nov 21 , 2025 | 09:17 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ సర్వీసును పొడిగించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెలాఖరుతో ముగియనున్న సీఎస్ కె. విజయానంద్ సర్వీసును మరో 3 నెలల పాటు పొడిగించాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది.
అమరావతి, నవంబరు21(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ (CS Vijayanand) సర్వీసును పొడిగించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandra babu Naidu) నిర్ణయం తీసుకున్నారు. ఈ నెలాఖరుతో ముగియనున్న సీఎస్ కె. విజయానంద్ సర్వీసును మరో 3 నెలల పాటు పొడిగించాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది.
మూడు నెలల సర్వీసు పొడిగింపుతో వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు సీఎస్‌గా కొనసాగనున్నారు విజయానంద్. మూడునెలల తర్వాత స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి. సాయి ప్రసాద్‌కు సీఎస్‌గా అవకాశం కల్పించనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. 2026 మేతో ముగియనుంది సాయి ప్రసాద్ పదవీ కాలం. ఆ తర్వాత కూడా సీఎస్‌గా సాయి ప్రసాద్‌ను కొనసాగించనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు ఇరువురు అధికారులకు ప్రభుత్వ పెద్దల నుంచి సమాచారం అందినట్లు వార్తలు వస్తున్నాయి.
ఇవి కూడా చదవండి..
ప్రజలకు ఇబ్బందులు లేకుండా భూముల రీ సర్వే చేయండి: రఘురామ
విద్యార్థులకు అలర్ట్.. టెన్త్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల
Read Latest AP News And Telugu News