Share News

AP Govt: వీఓఏలకు గుడ్ న్యూస్ చెప్పిన కూటమి ప్రభుత్వం

ABN , Publish Date - Oct 09 , 2025 | 08:47 PM

గత వైసీపీ ప్రభుత్వంలో వీఓఏలకు విధించిన కాలపరిమితిపై చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కాలపరిమితిని రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

AP Govt: వీఓఏలకు గుడ్ న్యూస్ చెప్పిన కూటమి ప్రభుత్వం

అమరావతి, అక్టోబర్ 09: గత వైసీపీ ప్రభుత్వంలో వీఓఏలకు విధించిన కాలపరిమితిపై చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కాలపరిమితిని రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు సెర్ప్ సీఈవో వాకాటి కరుణ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు ఎంఎస్ఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌తో వీఓఏల ప్రతినిధి బృందం ఈ రోజు వెలగపూడి సచివాలయంలో సమావేశమైంది. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ దృష్టికి వారి సమస్యలను తీసుకు వెళ్లారు. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వారికి ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు. క్షేత్ర స్థాయిలో వీఓఏల పాత్ర ఎంతో కీలకమని వారికి ఆయన స్పష్టం చేశారు.రెండు నెలల్లో 5 జీ అండ్రాయిడ్ ఫోన్లను అందిస్తామని వీఓఏల ప్రతినిధి బృందానికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి..

తొలి జాబితా విడుదల.. అభ్యర్థుల ఎంపికలో పీకే మార్క్

విజయసాయిరెడ్డి కుమార్తెకు హైకోర్టు ఝలక్

మరిన్ని ఏపీ, జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 09 , 2025 | 09:18 PM