Share News

Rain Alert In AP: అలర్ట్.. పిడుగులతో భారీ వర్షాలు..

ABN , Publish Date - Oct 09 , 2025 | 09:59 PM

అల్లూరి సీతారామరాజు, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో వర్షాలు పడతాయని ఏపీ విపత్త నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ఎవ్వరూ చెట్ల కింద నిలబడరాదని సూచించింది.

Rain Alert In AP: అలర్ట్.. పిడుగులతో భారీ వర్షాలు..
Rain Alert

అమరావతి: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) వ్యాప్తంగా శుక్రవారం నాడు పలు జిల్లాల్లో భారీ వర్షాలు(Heavy Rainfall) కురుస్తాయని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దక్షిణ ఒడిశా నుంచి మన్నార్ గల్ఫ్ వరకు వ్యాపించిన ద్రోణి ఇవాళ (గురువారం) దక్షిణ ఒడిశా నుంచి కొమోరిన్ ప్రాంతం వరకూ కోస్తాంధ్ర, రాయలసీమ, తమిళనాడు మీదుగా సముద్రమట్టానికి సగటున 0.9 కి.మీ. ఎత్తులో కొనసాగుతోందని తెలిపింది.


దీని ప్రభావంతో అల్లూరి సీతారామరాజు, రాయలసీమ(Rayalaseema) జిల్లాల్లో శుక్రవారం నాడు పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అల్లూరి సీతారామరాజు, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో వర్షాలు పడతాయని హెచ్చరించింది. ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ఎవ్వరూ చెట్ల కింద నిలబడరాదని సూచించింది. ఇక, మిగతా జిల్లాల్లోనూ దీని ప్రభావంతో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.


ఈ వార్తలు కూడా చదవండి..

తొలి జాబితా విడుదల.. అభ్యర్థుల ఎంపికలో పీకే మార్క్

రైతులకు గుడ్ న్యూస్.. నెలకు రూ.5000 పెన్షన్..

మరిన్ని ఏపీ, జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 09 , 2025 | 09:59 PM