AP Government: పీ4 - జీరో పావర్టీ కార్యక్రమంపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక సర్వే
ABN , Publish Date - Jul 22 , 2025 | 06:33 PM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పీ4 - జీరో పావర్టీ కార్యక్రమంపై ప్రత్యేక సర్వే చేయిస్తోంది. 12 ప్రశ్నలతో సర్వే నిర్వహిస్తోంది. ప్రత్యేకంగా యాప్ ద్వారా సర్వే చేస్తోంది. గ్రామ, వార్డ్ సచివాలయాల పరిధిలో ఈ సర్వే కొనసాగుతోంది. కుటుంబంలో ఎంత మంది ఉన్నారు.. ఇతర ప్రాంతాల్లో ఎవరున్నారు అనే అంశంపై సర్వే చేయిస్తోంది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) రాష్ట్రవ్యాప్తంగా పీ4 - జీరో పావర్టీ కార్యక్రమంపై ( P4 Zero Poverty Program) ప్రత్యేక సర్వే చేయిస్తోంది. 12 ప్రశ్నలతో సర్వే నిర్వహిస్తోంది. ప్రత్యేకంగా యాప్ ద్వారా సర్వే చేస్తోంది. గ్రామ, వార్డ్ సచివాలయాల పరిధిలో ఈ సర్వే కొనసాగుతోంది. కుటుంబంలో ఎంతమంది ఉన్నారు.. ఇతర ప్రాంతాల్లో ఎవరున్నారు అనే అంశంపై సర్వే చేయిస్తోంది. ఆస్తులు ఎన్ని.. ప్రభుత్వం ఇస్తున్న పథకాల వివరాలపై సంబంధిత అధికారులు ఆరా తీస్తున్నారు.
కార్, టూ వీలర్, భూమి ఉన్నాయా అని ప్రశ్నలు అడుగుతున్నారు. టీవీ ఫ్రిజ్..ఉన్నాయా...అని ప్రశ్నిస్తూ అధికారులు సర్వే చేస్తున్నారు. భవిష్యత్‌లో ఉద్యోగం కావాలా?.. బ్యాంక్ లోన్ కావాలా?..లేదా బిజినెస్ పెట్టుకుంటారా?. ఇలా పలు ప్రశ్నలని అడుగుతూ అధికారులు సర్వే చేస్తున్నారు. వ్యవసాయ రుణాలు, ఆదాయం వృద్ధి కోసం ఏమి కావాలనే అంశంపై ప్రశ్నలు అడుగుతున్నారు. వచ్చే నెల (ఆగస్టు) 5వ తేదీ వరకు ప్రభుత్వం సర్వే చేయనుంది. ఈ సర్వే అనంతరం ఆగస్టు 15వ తేదీన ఏపీ ప్రభుత్వం బంగారు కుటుంబాల ప్రకటన విడుదల చేయనుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
భక్తులకు అలర్ట్.. టీటీడీ కీలక నిర్ణయాలు
వేల కోట్ల భూములు.. ఖరీదైన విల్లాలు.. వెలుగులోకి మాజీ మంత్రి అనిల్ అక్రమాలు
For More AP News and Telugu News