Share News

AP Clears Pending Bills: కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులు.. ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్

ABN , Publish Date - Sep 30 , 2025 | 04:43 PM

ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుంచి ఇప్పటి వరకు పలు దఫాలుగా నాటి పెండింగ్ బిల్లుల చెల్లింపులను చేసుకుంటూ వచ్చింది. అయితే.. దసరా పండుగ సందర్భంగా బిల్లుల చెల్లింపుల ప్రక్రియ చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు.

AP Clears Pending Bills: కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులు.. ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
CM Chandrababu Naidu

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ దసరా పండుగ వేళ చిన్న కాంట్రాక్టర్లకు శుభవార్త చెప్పింది. దీంతో 2014-19 మధ్య పనులు చేసి సుదీర్ఘ కాలంగా బిల్లుల కోసం వేచిచూస్తున్న చిన్న కాంట్రాక్టర్లకు భారీ ఊరట లభించనుంది. రూ.5 లక్షల మేర పనులు చేసిన అన్ని బిల్లులు చెల్లించాలని ఆర్ధిక శాఖ నిర్ణయం తీసుకుంది. అలాగే.. 2019 నుంచి నేటి వరకు చేపట్టిన వాటిలో రూ.5 కోట్ల మేర బిల్లుల చెల్లింపులు కూడా చేస్తున్నట్లు ప్రకటించింది. ఆర్థిక శాఖ నిర్ణయంతో దాదాపు రూ.400 కోట్ల మేర చిన్న కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూరనుంది.


ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుంచి ఇప్పటి వరకు పలు దఫాలుగా నాటి పెండింగ్ బిల్లుల చెల్లింపులను చేసుకుంటూ వచ్చింది. అయితే.. దసరా పండుగ సందర్భంగా బిల్లుల చెల్లింపుల ప్రక్రియ భారీగా చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ మేరకు ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుంది. ఒకటి, రెండు రోజుల్లో చిన్న కాంట్రాక్టర్ల అకౌంట్లలోకి బిల్లుల సొమ్ము జమ కానున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో చిన్న కాంట్రాక్టర్లు.. సీఎం చంద్రబాబుకు, కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం కొలువు తీరిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

శబరిమల అయ్యప్ప స్వామి భక్తులకు శుభవార్త

ఢిల్లీలో భారీ వర్షం, ట్రాఫిక్ ఇబ్బందులు..విమాన సర్వీసులపై ప్రభావం

Updated Date - Sep 30 , 2025 | 04:55 PM