Share News

Amaravati Land Pooling: అమరావతి కోసం.. రెండో విడత ల్యాండ్ పూలింగ్ ప్రారంభం

ABN , Publish Date - Dec 04 , 2025 | 10:50 AM

అమరావతి అభివృద్ధి, విస్తరణ కోసం భూములు ఇచ్చేందుకు రైతులు మరోసారి ముందుకు వచ్చారు. రెండో విడత ల్యాండ్ పూలింగ్‌కు సర్కార్ ఉత్తర్వులు జారీ చేయగా.. భూముల సేకరణ ప్రక్రియ మొదలైంది.

Amaravati Land Pooling: అమరావతి కోసం.. రెండో విడత ల్యాండ్ పూలింగ్ ప్రారంభం
Amaravati Land Pooling

పల్నాడు జిల్లా, డిసెంబర్ 4: అమరావతి కోసం రెండో విడత ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ఈరోజు (గురువారం) ప్రారంభమైంది. ఇందులో భాగంగా అమరావతి మండలం యండ్రాయిలో గ్రామ సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ (Minister Narayana), ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పాల్గొన్నారు. రెండో విడతలో అమరావతి మండలంలో నాలుగు గ్రామాలకు చెందిన రైతుల నుంచి అధికారులు భూమిని సేకరించనున్నారు. ముందుగా యండ్రాయి గ్రామంలో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను అధికారులు మొదలుపెట్టారు. ఈ సందర్భంగా అమరావతి కోసం యండ్రాయి రైతు నంబూరి బలరాం 4 ఎకరాల భూముని ఇచ్చారు. ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ సమక్షంలో మంత్రి నారాయణకు పొలం పత్రాలను రైతు నంబూరి అందజేశారు.


అందుకే ఆలస్యం: మంత్రి నారాయణ

గత వైసీపీ ప్రభుత్వం గుత్తేదారులకు బిల్లులు చెల్లించకపోవడంతో రాజధాని నిర్మాణం ఆలస్యమైందని ఈ సందర్భంగా మంత్రి నారాయణ విమర్శించారు. గుత్తేదారులకు చెల్లించాల్సిన బకాయిలు ఇచ్చి మళ్లీ రాజధాని పనులు ప్రారంభించే సమయానికి వర్షాలు ముంచెత్తాయని తెలిపారు. అంతర్జాతీయ రాజధాని నిర్మాణంలో భాగంగా స్మార్ట్ ఇండస్ట్రీలు, ఇంటర్నేషనల్ విమానాశ్రయం, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారని అన్నారు. రెండో విడతలో రైతులు ఇచ్చే 7000 పైగా ఎకరాల భూముల్లో 2500 ఎకరాలలో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు.


గతంలో భూ సమీకరణ సమయంలో రాజధాని రైతుల విషయంలో అనుసరించిన విధానాన్నే ఇక్కడ కూడా అమలు చేస్తామని చెప్పారు. ట్రంకు రోడ్లు, ప్రధాన రహదారులను వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. నాలుగు, ఆరు లైన్ల రహదారి నిర్మాణం చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించామని.. ఇక్కడ కూడా ఏడాది కాలంలోనే స్పోర్ట్స్ సిటీ నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి నారాయణ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి

విలీనం.. ఇక అధికారికం

శ్వాస తీసుకోలేడు.. అన్నం తినలేడు.. ఏడాది గడిచినా దయనీయ స్థితిలోనే శ్రీతేజ్‌

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 04 , 2025 | 11:27 AM