Share News

AP News: కోటప్పకొండ గిరిప్రదక్షిణలో అపశృతి

ABN , Publish Date - May 12 , 2025 | 10:38 AM

Kotappakonda Giri Pradakshina: కోటప్పకొండలో గిరిప్రదక్షిణకు సోమవారం నాడు భక్తులు భారీగా తరలి వచ్చారు. ఈ సమయంలో అనుకోని ఘటన జరిగింది. ఓ భక్తుడు గిరిప్రదక్షిణ చేస్తుండగా కళ్లు తిరిగి పడ్డాడు. తీవ్ర అనారోగ్యంతో ఆ భక్తుడు మృతిచెందాడు.

AP News: కోటప్పకొండ గిరిప్రదక్షిణలో అపశృతి
Kotappakonda Giri Pradakshina

పల్నాడు జిల్లా: పల్నాడు జిల్లాలోని నరసరావుపేట మండలంలో గల ప్రసిద్ధ శైవ పుణ్యక్షేత్రం కోటప్పకొండకు భక్తులు చాలామంది వస్తుంటారు. ఇక్కడ కొలువైన త్రికోటేశ్వరస్వామికి భక్తులు విశేష పూజలు చేస్తుంటారు. ఏదైనా కోరిక కోరుకుంటే స్వామివారు త్వరగా తీరుస్తారని భక్తుల విశ్వాసం. ఇవాళ(సోమవారం) వేల సంఖ్యలో భక్తులు కోటప్పకొండకు తరలి వచ్చి త్రికోటేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. ప్రతి పౌర్ణమికి కోటప్పకొండ గిరి ప్రదక్షిణ జరుగుతుందన్న విషయం తెలిసిందే. గిరి ప్రదక్షిణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.


వేసవి నేపథ్యంలో భక్తుల రాకను దృష్టిలో ఉంచుకుని అధికారులు సౌకర్యాలు కల్పించారు. గిరిప్రదక్షిణలో పాల్గొనడానికి భక్తులు భారీగా కొండకు చేరుకున్నారు. ఈ సమయంలో గిరిప్రదక్షిణలో అపశృతి చోటుచేసుకుంది. గిరిప్రదక్షిణ చేస్తూ ఓ భక్తుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఆ వ్యక్తి కళ్లు తిరిగి కిందపడటంతో పక్కనున్న భక్తులు గమనించి వెంటనే రోడ్డు పైకి తీసుకు వచ్చేసరికే ప్రసాద్(50) మృతిచెందాడు. మృతుడు ప్రసాద్ చిలకలూరిపేట మండలం పురుషోత్తపట్నం వాసిగా గుర్తించారు. ప్రసాద్ మృతిచెందడంతో కుటుంబ సభ్యులు తీవ్ర శోకంలో మునిగిపోయారు. మృతదేహాన్ని కుటుంబ సభ్యులు ఇంటికి తరలించడానికి ఏర్పాట్లు చేశారు.

death.gif


ఎన్టీఆర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

మరోవైపు.. ఎన్టీఆర్ జిల్లాలోని ఏ.కొండూరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారు, కూరగాయల వాహనం ఎదురెదురుగా వచ్చి ఢీ కొన్నాయి. వల్లంపట్లలో ఒక శుభకార్యంలో పాల్గొని తిరుగు ప్రయాణంలో కొండపల్లికి కారులో కుటుంబ సభ్యులు వెళ్తున్నారు. ఈ ప్రమాదంలో తిరుమలకొండ సుచిత్ర (6) తీవ్ర గాయాలతో మృతి చెందగా, మిగతా కుటుంబ సభ్యులకు తీవ్ర గాయాలయ్యాయి. అత్యవసర చికిత్స కోసం క్షతగాత్రులను విజయవాడకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి..

India- Pakistan War: రెండు దేశాల మధ్య కీలక చర్చలు

టిబెట్‌లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.7 తీవ్రత

ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం: 13మంది మృతి

ED Summons: సినీ నటుడు మహేష్ బాబుకు మరోసారి ఈడీ నోటీసులు..

For More AP News and Telugu News

Updated Date - May 12 , 2025 | 10:47 AM